ETV Bharat / bharat

యువకులను చితకబాది.. మూత్రం తాగించిన దుండగులు.. వీడియో తీసి​! - delhi news

ఇద్దరు యువకులను కిడ్నాప్​ చేసి దారుణంగా కొట్టారు నలుగురు వ్యక్తులు. ఆ తర్వాత బాధితులు దాహం వేస్తుందని నీరు అడిగితే వారితో మూత్రం తాగించారు. ఆ సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

dabangs-beat-up-two-youths-and-drinking-urines-in-shahjahanpur

author img

By

Published : Jul 15, 2022, 10:43 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో దారుణ ఘటన జరిగింది. ఇద్దరు యువకులను కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టారు నలుగురు వ్యక్తులు. ఆ తర్వాత యువకులు నీరు అడిగితే మూత్రం తాగించారు. అదే సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు నిందితులు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ జరిగింది.. షాజహాపుర్​లో సదర్ బజార్ ప్రాంతానికి చెందిన ఇస్తెఖార్, షబ్బూలకు.. అదే ప్రాంతంలో ఉండే సర్దార్ రాజు, కుల్వీందర్, జీతా, సుఖ్‌దేవ్‌లతో జులై 8న చిన్నపాటి గొడవ జరిగింది. ఘటన అనంతరం నిందితులు.. కారులో వచ్చి ఇద్దరు యువకులను కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత నలుగురు కలిసి ఇస్తెఖార్‌, షబ్బూలను దారుణంగా కొట్టారు.

ఆ తర్వాత బాధితులు దాహం వేస్తుందని తాగేందుకు నీరు అడిగారు. నిందితులు వారికి నీరు బదులు మూత్రం ఇచ్చి తాగించారు. బాధితులు మూత్రం తాగుతున్న సమయంలో నిందితులు వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసి వైరల్​ చేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం వెతుకుతున్నారు.

భర్త అత్యాచార వీడియోను సోషల్​మీడియాలో పోస్ట్​ చేసిన భార్య.. టీనేజర్​పై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ దారుణాన్ని చిత్రీకరించిన అతడి భార్య.. అనంతరం సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసి రాక్షసానందం పొందింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జులై 12న నిందితుడు.. తన గ్రామానికే చెందిన బాధితురాలిని ఇంటికి పిలిచి అత్యాచారం చేశాడు. ఈ దుశ్చర్యను నిందితుడి భార్య ఫోన్​లో రికార్డు చేసింది. ఎవరికైనా చెబితే.. సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తానని ఇద్దరూ బెదిరించారు. తర్వాత బాధితురాలు తన ఇంట్లో చెప్పగా.. నిందితులు వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు.

ఒకే ఇంట్లో నలుగురు ఆత్మహత్య?.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు.. తమ ఇంట్లో విగతజీవులుగా కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటన ఈశాన్య దిల్లీ జాఫ్రాబాద్​లోని మట్కా వాలీలో జరిగింది. బట్టల వ్యాపారం చేసే ఇస్రార్​ తొలుత.. తన భార్య సహా ఇద్దరు పిల్లలకు మత్తు మందు ఇచ్చి చంపేశాడని, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. వ్యాపారంలో నష్టాలు రావడమే దీనికి కారణమని అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని.. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి: టెన్త్ క్లాస్ విద్యార్థినిపై కారులో గ్యాంగ్​ రేప్​

స్టంట్​ పేరుతో నదిలోకి జంప్​.. తిరిగిరాని యువకుడు.. వీడియో వైరల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.