కాస్త ప్రత్యేకంగా కనిపిస్తే చాలు సోషల్ మీడియా ఏ వ్యక్తినైనా పాపులర్ చేసేస్తుంది. నెటిజన్లు వారి ఫొటోలు, వీడియోలు షేర్ చేసి స్టార్లుగా మారుస్తారు. ఇలా ఎంతోమంది ఓవర్‌నైట్ స్టార్లుగా మారి గొప్ప ఫాలోయింగ్‌ను పొందిన వారు ఉన్నారు. ఇప్పుడు మహారాష్ట్రలోని అంబర్నాథ్కు చెందిన ఓ వ్యక్తిని 'సిలిండర్ మ్యాన్' అంటూ సెలబ్రిటీని చేసింది సోషల్ మీడియా.
అంబర్‌నాథ్‌లోని లక్ష్మీనగర్‌కు చెందిన సాగర్ జాదవ్.. గత 12 ఏళ్లగా భారత్ గ్యాస్ సంస్థకు సిలిండర్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. సునాయాసంగా సిలిండర్లు మోస్తూ ఇళ్లకు డెలివరీలు చేసేవాడు. అతని ఫిట్‌నెస్‌కు ఆశ్చర్యపోయిన తుషార్ భామ్రే అనే వ్యక్తి సాగర్ చిత్రాలను తీసి ఫేస్బుక్లో షేర్ చేశాడు. అవి కాస్తా వైరలయ్యాయి. సాగర్ ఫిట్నెస్, శరీరాకృతికి నెటిజెన్లు ఫిదా అయ్యారు. సిలిండర్ మ్యాన్ అని పేరు పెట్టి అతడి ఫొటోలను తెగ షేర్ చేశారు.
ఈ సిలిండర్ మ్యాన్.. ఐఏఎస్ అధికారి తుకారామ్ ముంథే, నటుడు కుశాల్ భాద్రికే నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు.
తన చిత్రాలు వైరల్ కావడంపై సాగర్ జాదవ్ స్పందించాడు. కొద్ది సంవత్సరాల క్రితం సిలిండర్లు మోయడానికి ఇబ్బంది పడేవాడినని, శరీరాన్ని ధృడంగా మార్చుకునేందుకు జిమ్‌కు వెళ్లడం ప్రారంభించానని తెలిపాడు. పాపులారటీ సంపాదించుకున్న జాదవ్.. తనకు అవకాశం వస్తే నటించేందుకు కూడా సిద్ధమని అన్నాడు. సినిమా లేదా సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇస్తారా అనే ప్రశ్నపై ఈ విధంగా స్పందించాడు.
ఇదీ చూడండి : viral video: పులి వేటాడటం ఎప్పుడైనా చూశారా?