ETV Bharat / bharat

యాస్​ తుపాను: పొంచి ఉన్న 'పున్నమి' గండం - imd on cyclone yaas

యాస్​ తుపాను తీరం దాటినా.. పౌర్ణమి, చంద్రగ్రహణాల ప్రభావం తీర ప్రాంతాల్లో తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాల్​లోని ఐదు సబ్‌ డివిజన్లు, ఒడిశాలోని నాలుగు బ్లాక్‌లు నీట మునిగే ప్రమాదముందని వెల్లడించింది. తీర ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

cyclone yaas, యాస్​ తుపాను
యాస్​ తుపాను ప్రభావం
author img

By

Published : May 26, 2021, 4:14 PM IST

దేశ తూర్పు తీరంపై విరుచుకుపడుతున్న యాస్ తుపాను ఎట్టకేలకు తీరం దాటింది. ఈ ఉదయం 10.30 నుంచి 11.30 గంటల ప్రాంతంలో ఒడిశాలోని బాలేశ్వర్​ వద్ద తీరం దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. అయితే ఇప్పటికే బంగాల్​, ఒడిశా తీర ప్రాంతాలను అతలాకుతలం చేసిన ఈ తుపానుకు ఇప్పుడు 'పున్నమి' కూడా తోడైంది. దీంతో తీరం దాటినా కూడా మరింత ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.

ఈ రోజు పౌర్ణమి.. దీనికి తోడు సంపూర్ణ చంద్రగ్రహణం కూడా ఉంది. ఆ సమయంలో అలల ఉద్ధృతితో సముద్రం మరింత అల్లకల్లోలంగా మారే అవకాశముందని ఐఎండీ అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో తీర ప్రాంతాల్లో తుపాను పెను బీభత్సం సృష్టించనుందని హెచ్చరించారు. బంగాల్​లోని ఐదు సబ్‌ డివిజన్లు, ఒడిశాలోని నాలుగు బ్లాక్‌లు నీట మునిగే ప్రమాదముందన్నారు.

సాధారణంగా జాబిల్లి భూమికి చాలా దగ్గరగా వచ్చినప్పుడు సూపర్‌మూన్‌ కన్పిస్తుంది. ఆ సమయంలో సముద్రంలో ఆటుపోట్లు విపరీతంగా ఉంటాయి. అలలు గరిష్ఠ ఎత్తులో ఎగసిడుతుంటాయి. ఇక చంద్రగ్రహణం కూడా ఇదే రోజున ఉంది. భారత్‌లో బుధవారం మధ్యాహ్నం 3.15 గంటల నుంచి చంద్రగ్రహణం మొదలవనుంది. దీంతో ఈ సాయంత్రం తీర ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

పెనుగాలుల బీభత్సం..

ఇదిలా ఉండగా.. యాస్ తుపాను ధాటికి ఇప్పటికే బంగాల్​, ఒడిశాలోని తీర ప్రాంతాలు అల్లాడిపోతున్నాయి. గంటకు 155 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తుండటం వల్ల అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. భవనాలు ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. ప్రచండ గాలులకు ఇంటి పైకప్పులు ఎగిరిపడ్డాయి. ప్రస్తుతం ఈ తుపాను వాయవ్య దిశగా కదులుతూ మరో 3 గంటల్లో బలహీనపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో ఝార్ఖండ్‌లోనూ భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది.

విమానాలు రద్దు..

తుపాను ప్రభావంతో ముంబయి నుంచి బంగాల్​, ఒడిశా వెళ్లే విమానాలు రద్దయ్యాయి. ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్టు నుంచి కోల్‌కతా, భువనేశ్వర్‌ వెళ్లే ఆరు విమాన సర్వీసులను ఎయిర్‌పోర్టు అధికారులు రద్దు చేశారు. మరోవైపు ముంపు ప్రాంతాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

ఇదీ చదవండి : 'యాస్' ఉగ్రరూపం- 11 లక్షల మంది తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.