ETV Bharat / bharat

గుజరాత్​లో తీరం దాటిన 'తౌక్టే' తుపాను

author img

By

Published : May 17, 2021, 3:24 PM IST

Updated : May 18, 2021, 2:06 AM IST

तौक्ते अभी उत्तर दिशा की तरफ बढ रहा है. ये चक्रवात मुंबई से 142 किमी और दिव से 182 किमी अंतर पर है.

Strong winds at 114 kmph strike Mumbai
అతితీవ్ర తుపానుగా 'తౌక్టే'

02:02 May 18

అధికారులతో సమావేశమైన సీఎం

  • In view of Cyclone Taukate, Gujarat Chief Minister Vijay Rupani last night held a meeting with officials of the coastal districts of Valsad and Gir Somnath at the State Control Room in Gandhinagar pic.twitter.com/WfKW1zZoeq

    — ANI (@ANI) May 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తౌక్టే తుపాను ప్రభావం దృష్ట్యా.. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని వల్సాద్, గిర్ సోమ్​నాథ్ తీర ప్రాంత జిల్లాల అధికారులతో సమావేశమం అయ్యారు. 

01:35 May 18

  • The extremely severe cyclonic storm Tauktae weakened into a very severe cyclonic storm and lay centred at 11:30 pm on May 17 over Saurashtra, about 30 km northeast of Diu. Rear sector of the eye wall region is entering into land: IMD

తీరం దాటిన 'తౌక్టే'

తౌక్టే తుపాను గుజరాత్​లో తీరం దాటింది. అతి తీవ్ర తుపాను తీవ్రత స్వల్పంగా తగ్గింది. 

20:58 May 17

తీరాన్ని తాకిన తుపాను..

అరేబియా తీర రాష్ట్రాలను హడలెత్తించిన తౌక్టే తుపాను ఎట్టకేలకు తీరాన్ని తాకింది. గుజరాత్‌లోని పోరుబందర్‌- మహువా మధ్య ప్రాంతంలో తీరాన్ని తాకి తీవ్ర తుపానుగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరో 2 గంటల అనంతరం బలహీనపడే అవకాశముందని పేర్కొంది. తుపాను కారణంగా 185 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. 

గుజరాత్​లోని 4 జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. ఇప్పటికే తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

గుజరాత్‌లో ఇప్పటికే లక్షన్నర మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుజరాత్‌లో 44 ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించారు. 

18:44 May 17

కొంకణ్​లో ఆరుకు చేరిన మృతులు..

మహారాష్ట్ర కొంకణ్​పై తౌక్టే ప్రతాపం చూపుతోంది. పడవ మునక సహా వేర్వేరు ఘటనల్లో మొత్తం ఆరుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. 

18:39 May 17

ఎగసిపడుతున్న అలలు..

ముంబయి జుహూ బీచ్​లో అలలు ఎగసిపడుతున్నాయి. తౌక్టే తీవ్రంగా ప్రభావితం చూపుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి.

18:38 May 17

ముంబయి విమానాశ్రయం మూసివేత..

తుపాను ప్రభావంతో రాత్రి 8 వరకు ముంబయి ఎయిర్‌పోర్టు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 

17:03 May 17

సీఎంలతో మాట్లాడిన మోదీ..

తౌక్టే తుపాను ప్రభావిత రాష్ట్రాలు గుజరాత్​, గోవా ముఖ్యమంత్రులు, దమన్​ దీవ్​ లెఫ్టినెంట్​ గవర్నర్​లతో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. తౌక్టే తుపాను సన్నద్ధత, సహాయక చర్యలపై అడిగి తెలుసుకున్నారు.

15:30 May 17

410 మంది గల్లంతు..

తౌక్టే తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మహారాష్ట్ర ముంబయిలో ప్రభావం ఎక్కవగా ఉంది. తౌక్టే ధాటికి ముంబయి తీరప్రాంతంలో రెండు పడవలు కొట్టుకుపోయాయి. అందులో మొత్తం 410 మంది ఉన్నట్లు సమాచారం.

ఐఎన్​ఎస్​ కొచ్చి యుద్ధనౌక సాయంతో పీ305 నౌక కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది నౌకాదళం. 

మరొక నౌకలో 137 మంది ఉన్నట్లు తెలిసింది. ఈ జీఏఎల్​ కన్​స్ట్రక్టర్ నౌక కోసం.. ఎఎన్​ఎస్​ కోల్​కతా యుద్ధనౌక రంగంలోకి దిగింది. 

తౌక్టే ప్రభావంతో.. ముంబయిలో పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ​ 

15:25 May 17

సీఎంతో మాట్లాడిన మోదీ..

తౌక్టే తుపాను నేపథ్యంలో ముంబయిలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. తౌక్టే విషయమై.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేతో మాట్లాడారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రంలో పరిస్థితులపై ఆరా తీశారు. 

15:25 May 17

కొట్టుకుపోయిన నౌక..

  • తౌక్టే ధాటికి ముంబయి తీరంలో కొట్టుకుపోయిన వ్యాపార నౌక
  • కొట్టుకుపోయిన వ్యాపార నౌకలో 273 మంది సిబ్బంది
  • నౌకలోని సిబ్బందిని కాపాడేందుకు రంగంలోకి నౌకాదళం
  • ఐఎన్‌ఎస్‌ కొచ్చి యుద్ధ నౌక సాయంతో గాలింపు చర్యలు

15:17 May 17

గుజరాత్​లో తీరం దాటిన 'తౌక్టే' తుపాను

అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాన్‌.. అతి తీవ్ర తుపాన్‌గా మారింది. పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ఈ రాత్రికి గుజరాత్‌లోని పోరుబందర్‌ -మహువా మధ్య ప్రాంతంలో తీరం దాటనుందని వాతావరణ విభాగం తెలిపింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలతో.. తీర ప్రాంతాలను హడలెత్తిస్తోంది.

Last Updated : May 18, 2021, 2:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.