Cyber Fraud Alert on Telegram : టెక్నాలజీ రోజురోజుకూ ఏ విధంగా కొత్త పుంతలు తొక్కుతుందో.. సైబర్ మోసాలు కూడా అదేవిధంగా డెవలప్ అవుతున్నాయి. వీటిపై నిత్యం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త పంథాలో మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు! ఇప్పటివరకు గిఫ్ట్స్, యాడ్స్, ఆఫర్లు, ఓటీపీలు అంటూ.. యూజర్ల డబ్బు కాజేసిన సైబర్ ముఠాలు.. తాజాగా మరో సరికొత్త మోసానికి తెర లేపారు. మరి.. అది ఎలా చేస్తున్నారో.. ఈ స్టోరీ ద్వారా తెలుసుకోండి.
Cyber Dosth Alert on Free Movie Links : ఇంతకుముందు ఏదైనా కొత్త సినిమా రిలీజయితే ఎక్కువగా దాన్ని థియేటర్లో చూడడానికే చాలా మంది మొగ్గు చూపేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మూవీ చూసే టైమ్ లేకనో.. డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకనో.. మొత్తానికి ఓటీటీ(OTT) లో సినిమాలు చూసేవారి సంఖ్య భారీగానే పెరిగిపోయింది.
మీ ఫోన్‌కు రోజులో 12 ఫేక్ మెసేజ్‌లు! టచ్ చేస్తే ఖతమే! అవేంటో తెలుసా?
అయితే ఓటీటీల్లో సినిమా, వెబ్‌సిరీస్ చూడాలంటే సబ్స్క్రిప్షన్ అవసరం. దాంతోపాటు.. ఓటీటీకి వచ్చేవరకూ వెయిట్ చేయాలి. కానీ.. ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేకుండా.. ఓటీటీలో రిలీజే అయ్యేవరకూ ఆగకుండా.. థియేటర్లోకి వచ్చిన వెంటనే సినిమా చూసే ఆప్షన్స్ ఆన్లైన్లో చాలానే ఉన్నాయి. వీటితోపాటు టెలిగ్రామ్(Telegram) ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. దీంతో.. జనాలు టెలిగ్రామ్ గ్రూపుల్లో ఎడాపెడా చేరుతున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన సైబర్ నేరగాళ్లు.. తమ నేరాలకు టెలిగ్రామ్‌ను అడ్డాగా చేసుకుంటున్నారు.
ఏం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు?
సాధారణంగా టెలిగ్రామ్‌లో మూవీ పేరు సెర్చ్ చేయగానే ఫ్రీ డౌన్‌లోడింగ్ అంటూ కొన్ని లింక్స్ వస్తాయి. అవి సినిమాకు సంబంధించిన లింక్సే అనుకొని చాలా మంది వాటిపై క్లిక్ చేస్తారు. అంతే.. ఇక ఆ యూజర్ సైబర్ ఉచ్చులో చిక్కుకున్నట్లే. వెంటనే వ్యక్తిగత వివరాలతోపాటు బ్యాంక్ అకౌంట్ వివరాలు.. అందులోని అమౌంట్ గురించిన మొత్తం సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలో పడుతుంది. ఆ తర్వాత క్షణాల్లోనే అకౌంట్ మొత్తం ఖాళీ చేసేస్తున్నారు.
మరికొన్ని గ్రూపుల్లో ఫ్రీగా మూవీ చూడాలంటే పలానా యాప్‌ని ఇన్స్టాల్ చేసుకోవాలని సూచిస్తున్నాయి. అందులో సినిమా వేగంగా డౌన్‌లోడ్ అవుతుందనో.. మంచి ప్రింట్ ఉందనో ఉంటుంది. వీటిని డౌన్ లోడ్ చేసినా కూడా అకౌంట్లోని సొమ్ము మొత్తం సైబర్ నేరగాళ్లకు సమర్పించుకున్నట్టే. ఈ తరహా నేరాలు ఇటీవల భారీగా పెరిగినట్టు కేంద్రం తెలిపింది.
సైబర్ నేరాల నియంత్రణకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే సైబర్ దోస్త్(Cyber Dost).. ఈ తరహా మోసాల గురించి వివరించింది. టెలిగ్రామ్ యాప్‌ను ఆసరగా చేసుకొని సైబర్ నేరగాళ్లు దోపిడీ చేస్తున్నారని హెచ్చరించింది. ఇలాంటి మోసాల పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని.. ఫ్రీ సినిమా అని కనిపించే టెలిగ్రామ్ లింక్‌ల ద్వారా యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని సైబర్ దోస్త్ హెచ్చరిస్తోంది.
వారి ముచ్చట్లు విన్నారా - మీ ఖాతా ఖాళీ అయినట్లే
e-Challan Frauds in Hyderabad : ఈ-చలానా మెసేజ్ మీకూ వచ్చిందా.. అయితే బీ కేర్‌ఫుల్