ఇటీవల ముగిసిన నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల్లో తమ వైఫల్యాలపై చర్చిండానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సోమవారం సమావేశం కానుంది. ఎన్నికల్లో తమ పనితీరుపై ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆ పార్టీలోని నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా ఓటమితో పాటు.. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలపైనా కాంగ్రెస్ ఈ భేటీలో దృష్టిసారించనుంది. ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ప్రదర్శన చేయడంపై సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించనుంది.
అంతకుముందు.. కాంగ్రెస్ ఎంపీలతో ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సమావేశమయ్యారు. ఎన్నికల్లో కాంగ్రెస్ చూపిన పని తీరు నిరాశాజనకంగా ఉందని అన్నారు.
ఇదీ చూడండి: కరోనాపై అఖిలపక్ష భేటీకి సోనియా డిమాండ్