ETV Bharat / bharat

సీడబ్ల్యూసీ భేటీ.. సీనియర్లు అసంతృప్తి వెళ్లగక్కుతారా?

CWC MEETING: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించేందుకు సీడబ్లూసీ సమావేశం ఆదివారం దిల్లీలో జరగనుంది. పార్టీలో సంస్థాగత మార్పులు, రాహుల్ నాయకత్వంపై జీ23 నేతలు ఈ భేటీలో ప్రశ్నలు కురిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

congress
కాంగ్రెస్
author img

By

Published : Mar 12, 2022, 8:23 PM IST

CWC MEETING: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన ఆదివారం సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. దిల్లీలో సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన కాంగ్రెస్‌.. ఓటమికి గల కారణాలపై ఆత్మ పరిశీలన చేసుకోనుంది.

పార్టీలో సంస్థాగత మార్పులను కోరుకుంటున్న కాంగ్రెస్ అసంతృప్త నేతల(జీ23) బృందం.. సీడబ్ల్యూసీ సమావేశంలో అసంతృప్తి వెళ్లగక్కే అవకాశం ఉంది. రాహుల్ నాయకత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం. ఈ బృందం శుక్రవారం సాయంత్రమే పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఇంట్లో సమావేశమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ పేలవమైన పనితీరు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరిపింది. పార్టీ అధిష్ఠానం సిద్ధూకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్లే.. పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని భేటీలో మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

"పంజాబ్​లో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య సమైక్యత లోపించడం వల్లే పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. పార్టీ అధిష్ఠానం.. పంజాబ్​ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్​ సిద్ధూకి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. సిద్ధూ ఇష్టానుసారంగా పార్టీ నేతలతో వ్యవహరించినా.. ఆయనను నిలువరించడంలో అధిష్ఠానం విఫలమైంది. నరేంద్ర మోదీని చూసి భాజపాకు, అరవింద్ కేజ్రీవాల్​ని చూసి ఆమ్ ఆద్మీకి ఓటేస్తున్నారు. కాంగ్రెస్​కు ఎవరిని చూసి ఓటేస్తారు" అని పార్టీ నేత ఒకరు అన్నట్లు సమాచారం.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పంజాబ్‌లో అధికారం కోల్పోవటం సహా.. మిగతా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఘోరమైన ఫలితాలు వచ్చాయి. ఇంకా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఛత్తీస్​గఢ్, రాజస్థాన్​ మాత్రమే.

ఇదీ చదవండి: కాంగ్రెస్​కు మరో షాక్.. కీలక నేత రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.