మే చివరినాటికి( చివరి రెండు వారాలు) ప్రస్తుత కరోనా రెండో దశ తగ్గుతుందని ప్రముఖ వాక్సినాలజిస్టు గగన్‌దీప్ కాంగ్ అభిప్రాయపడ్డారు. మళ్లీ కరోనా ఉత్పాతాలు వచ్చే అవకాశం ఉందని, కానీ అవి అంతటి తీవ్రమైనవి కాబోవని అన్నారు.
అయితే "గతేడాది కరోనా కేసులు గ్రామాల్లో ఎక్కువగా నమోదు కాలేదు కానీ ఇప్పుడు అవుతున్నాయి. అయినా కరోనా ఉద్ధృతి గ్రామాల్లో తగ్గుముఖం పడుతుంది" అని తెలిపారు.
దేశంలో కరోనా పరీక్షలు తక్కువగా చేయడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. "నిజంగా చెప్పాలంటే కరోనా పరీక్షల కంటే వైరస్ బారినపడే వారి సంఖ్య ఎక్కువ. ఫ్లూ వైరస్లాగా కరోనా మరింత కాలానుగుణమైనదిగా మారుతుంది. కానీ టీకాల వల్ల మాత్రమే ప్రజలు ఒక స్థాయి రోగనిరోధక శక్తిని పొందుతారు" అని ఆమె చెప్పారు.
ఇదీ చదవండి: 'ఉత్తర భారతాన్ని వణికిస్తున్న బ్రిటన్ రకం వైరస్'