ETV Bharat / bharat

'పెరుగు' వివాదంపై దిగొచ్చిన కేంద్రం.. CM ఆగ్రహంతో 'దహీ' నిర్ణయం వెనక్కి! - hindi language issue in tamil nadu

పెరుగు ప్యాకెట్లపై పేరు విషయంలో తమిళనాడు, కర్ణాటకలో రాజకీయ దుమారం రేగిన వేళ.. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ వెనక్కు తగ్గింది. పెరుగు పేరును హిందీలో మాత్రమే ముద్రించాలన్న ఆదేశాలపై తీవ్ర నిరసన వ్యక్తం కాగా.. ఆంగ్లంతోపాటు ప్రాంతీయ భాషలను కూడా ప్రస్తావించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు మొదట జారీ చేసిన ఉత్తర్వులను సవరించింది.

curd issue
curd issue
author img

By

Published : Mar 31, 2023, 7:16 AM IST

హిందీ భాష విషయంలో కేంద్రంతో విభేదాలు కొనసాగుతున్న వేళ తమిళనాడు మరో వివాదం తెరపైకి వచ్చింది. తమిళనాట ప్యాకెట్లపై పెరుగు పేరును.. హిందీలోకి మార్చడంపై తీవ్ర దుమారం రేగింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌ సహా పలువురు నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ- ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఇటీవల తమిళనాడు మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌కు పెరుగు పేరుపై కొన్ని ఆదేశాలు జారీ చేసింది. పెరుగు ప్యాకెట్లపై ఆంగ్లంలో ఉన్న కర్డ్​, తమిళంలో ఉన్న 'తయిర్‌' పేర్లను తొలగించి.. 'దహీ' అని హిందీలోకి మార్చాలని చెప్పేలా ఉత్తర్వులు వెలువరించింది.

పెరుగుతోపాటు నెయ్యి, చీజ్‌ వంటి డైరీ ఉత్పత్తుల పేర్లను కూడా.. ఇలాగే మార్చాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశించింది. తమిళనాడు పొరుగు రాష్ట్రమైన.. కర్ణాటకకు కూడా ఇలాంటి ఉత్తర్వులే పంపినట్లు తెలిసింది. ఈ ఆదేశాలపై కర్ణాటక, తమిళనాట తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆ నిర్ణయాన్ని వెనక్కుతీసుకుంటున్నట్లు వెల్లడించింది. పెరుగు పేరు మార్పుపై జారీ చేసిన ఆదేశాలను సవరించింది. పెరుగు ప్యాకెట్లపై ఆంగ్ల పేరుతో పాటు.. స్థానిక భాషల పేర్లను బ్రాకెట్లలో పెట్టుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాల పాల ఉత్పత్తిదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. తాము దహీ అనే పేరును వినియోగించబోమని ఈ రెండు రాష్ట్రాలు స్పష్టం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కూడా ఈ ఆదేశాలపై మండిపడ్డారు. హిందీని బలవంతంగా రుద్దాలనే వారి పట్టుదల మరింత పెరుగుతోందన్న ఆయన.. చివరకు పెరుగు ప్యాకెట్‌పైనా తమ సొంత భాషలో ఉన్న పేరును మార్చేసి.. హిందీలో రాయాలని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతృభాషల పట్ల.. ఇలాంటి నిర్లక్ష్యం పనికిరాదని స్పష్టం చేశారు. దీనికి బాధ్యులైన వారిని దక్షిణాది శాశ్వతంగా బహిష్కరిస్తుందని స్టాలిన్‌ ధ్వజమెత్తారు.

బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాలన్న.. ప్రధాని మోదీ విధానాలకు విరుద్ధంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు ఉన్నాయని మండిపడ్డారు. ఈ ఉత్తర్వులను.. వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నామలై డిమాండ్‌ చేశారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కూడా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ (కేఎంఎఫ్‌) ప్రస్తుతం పంపిణీ చేస్తున్న నందిని బ్రాండు పేరును మార్చి హిందీని అమలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. నందిని బ్రాండు కన్నడిగుల ఆస్తి అని.. ఆ గుర్తింపును మార్చాలనుకోవడం కేంద్రం మూర్ఖత్వమని పేర్కొన్నారు.

మార్చి 10న కేంద్రం ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ కర్డ్​కు బదులుగా దహీ అనే పదాన్నిపెరుగు ప్యాకెట్లపై వినియోగించాలని ఆదేశాలు జారీచేసింది. అయితే ప్రస్తుత సవరణ ప్రకారం.. కర్డ్‌ (దహీ-హిందీ), కర్డ్‌ (మోసారు-కన్నడ), కర్డ్‌ (తాయిర్‌-తమిళం), కర్డ్‌ (పెరుగు-తెలుగు) పదాలను వాడవచ్చని సూచించింది. పలు వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్​ఎస్​ఎస్ఏఐ వెల్లడించింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.