దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. మొత్తంగా 9.40 కోట్ల డోసుల పంపిణీ జరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గురువారం ఒక్కరోజే 34 లక్షల 73 వేల 83 డోసుల టీకాలు వేసినట్లు వెల్లడించింది.
టీకా తొలి డోసు తీసుకున్న వారు
ఆరోగ్య సిబ్బంది- 89,74,122
ఫ్రంట్లైన్ వర్కర్లు- 98,09,525
రెండో డోసు తీసుకున్న వారు
ఆరోగ్య సిబ్బంది- 54,48,206
ఫ్రంట్లైన్ వర్కర్లు- 45,41,636
3 కోట్ల 74 లక్షలకు పైగా వృద్ధులు కొవిడ్ టీకా తొలి డోసు తీసుకోగా.. 13 లక్షల 51 వేల మంది వృద్ధులు రెండో డోసు తీసుకున్నారు. 45-59 మధ్య వయస్కుల వారిలో 2 కోట్ల 59 లక్షలకు పైగా టీకా తొలి డోసు తీసుకున్నారు.
'టీకాల కొరతేం లేదు'
దేశంలో టీకాల కొరతేం లేదని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. ఇప్పటివరకు 9.4 కోట్ల వ్యాక్సిన్ డోసులు వినియోగించామని, 2.4 కోట్ల టీకా డోసులు మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. 1.9 కోట్ల టీకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కేంద్రం నుంచి సరిపడా టీకాలు అందడం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్రం అధిక టీకాలు సరఫరా చేసిన మొదటి మూడు రాష్ట్రాల్లో భాజపాయేతర రాష్ట్రాలైన మహారాష్ట్ర, రాజస్థాన్ ఉన్నాయని వివరించారు.
ఇదీ చదవండి:రఫేల్ ఒప్పందంలో అక్రమాలు జరగలేదు: డసో