Crypto Hack News: క్రిప్టోకరెన్సీ చోరీ కేసును దిల్లీ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు చెందిన మిలిటరీ వింగ్ (అల్-కస్సామ్ బ్రిగేడ్స్) సైబర్ మాడ్యూల్‌ను బయటపెట్టారు. టెక్నాలజీని ఉపయోగించి క్రిప్టో వాలెట్ల నుంచి డబ్బులను ఆ సంస్థ డిజిటల్ వాలెట్లకు అక్రమంగా బదిలీ చేశారని గుర్తించారు.
Delhi Crypto Hack: దిల్లీలోని పశ్చిమ విహార్ పోలీసు స్టేషన్లో కొంతకాలం క్రితం ఈ కేసు నమోదైంది. గుర్తుతెలియని వ్యక్తులు తమ రూ.4.5 కోట్ల విలువగల క్రిప్టోకరెన్సీని వాలెట్ నుంచి అక్రమంగా బదిలీ చేసుకున్నారని ఫిర్యాదు వచ్చింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు విస్తుపోయే నిజాలను బయటపెట్టారు.
ఈ సొమ్ము.. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు చెందిన మిలిటరీ వింగ్ (అల్-కస్సామ్ బ్రిగేడ్స్) అకౌంట్లకు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. వివిధ డిజిటల్ వాలెట్ల నుంచి బదిలీ అయి.. చివరికి హమాస్‌కు చేరాయని తేల్చారు. ఈ సంస్థకు చెందిన వాలెట్లను ఇజ్రాయెల్ ఇప్పటికే నిషేధించిందని చెప్పారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: తప్పిపోయిన ఆ పిల్లి జాడ చెబితే రూ.35వేల రివార్డ్!