ETV Bharat / bharat

'ముంబయి డ్రగ్స్​ కేసు.. మరో నలుగురి అరెస్ట్​' - రేవ్‌పార్టీ కేసు

రేవ్‌పార్టీ(Mumbai Rave Party) కేసులో మంగళవారం మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎన్​సీబీ అధికారులు తెలిపారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయినవారి సంఖ్య 16కు చేరిందన్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందన్నారు.

cruise ship party case
ముంబయి డ్రగ్స్​ కేసు
author img

By

Published : Oct 6, 2021, 5:05 AM IST

రేవ్‌పార్టీ(Mumbai Rave Party) కేసులో తాజాగా నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎన్​సీబీ అధికారులు తెలిపారు. నిందితులను ఎన్​సీబీ కస్టడీకు తరలించేందుకు కోర్టును బుధవారం కోరుతామని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ అయిన సమీర్‌ వాంఖడే తెలిపారు.

" ఈ రోజు మరో నలుగురిని అరెస్ట్ చేశాం. వాళ్లు రేవ్​పార్టీని నిర్వహించారు. వీరిని ఎన్​సీబీ కస్టడీకు తరలించేందుకు కోర్టును అనుమతి కోరతాం. ఇప్పటివరకు ఈ కేసులో 16 మందిని అరెస్ట్ చేశాం."

-- సమీర్‌ వాంఖడే, ఎన్‌సీబీ ముంబయి జోనల్‌ డైరెక్టర్‌

మరోవైపు ముంబయి డ్రగ్స్ కేసుపై పంజాబ్ సీఎం చరణ్​జీత్​ సింగ్​ చన్నీ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాలనుంచి అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్​ను అరికట్టేందుకు పంజాబ్​లోని అంతర్జాతీయ సరిహద్దును మూసివేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్​షాను కోరారు.

ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్​ను(Aryan Khan Arrest) అక్టోబరు 7 వరకు ఎన్​సీబీ కస్టడీకి తరలిస్తున్నట్లు కోర్టు ఆదేశించింది.

ఇదీ చదవండి: Drugs news: డ్రగ్స్​ కేసులో షారుక్ ఖాన్​ తనయుడు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.