ETV Bharat / bharat

ముంబయి డ్రగ్స్ కేసుపై సుప్రీంలో పిల్.. ఎందుకంటే... - మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ న్యూస్ లేటెస్ట్

ముంబయి క్రూయిజ్ షిప్​ డ్రగ్స్ కేసు విచారణ దశలో ఉన్నప్పటికీ.. పలువురు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ఈ కేసులో సీబీఐతో విచారణతో పాటు.. సాక్షుల రక్షణకు ప్రత్యేక విధానాన్ని రూపొందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అందులో కోరారు.

DRUGS
డ్రగ్స్ కేసు
author img

By

Published : Oct 31, 2021, 6:23 PM IST

బాలీవుడ్ సూపర్​స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నిందితునిగా ఉన్న ముంబయి క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసులో సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసు పలు వివాదాలకు దారితీసిన నేపథ్యంలో.. సాక్షులుగా ఉన్నవారందరికీ రక్షణ కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయవాది ఎంల్​ శర్మ సర్వోన్నత సుప్రీంకోర్టులో పిల్‌ వేశారు. నిందితులకు అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చేలా హింసించడం, అరెస్టు చేయడం వంటి జరగకుండా సాక్షుల రక్షణకు బాధ్యత వహించాలని పిల్​లో కోరారు.

రాజ్యాంగబద్ధ సందేహాలు..

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్​సీబీ) ముంబయి జోనల్‌ కమిషనర్‌ సమీర్‌ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ చేసిన అవినీతి ఆరోపణలను పిల్‌లో పిటిషనర్ లేవనెత్తారు. దర్యాప్తులో జోక్యం సహా.. అధికారిని వ్యక్తిగతంగా దూషించిన మంత్రి రాజ్యాంగబద్ధ పదవిలో కొనసాగించవచ్చా అని ప్రశ్నించారు. ఈ కేసు సాక్షుల్లో ఒకరైన ప్రభాకర్ సాయిల్​ అరెస్టు చట్టబద్ధతపైనా అనుమానాలు వ్యక్తం చేశారు.

అక్టోబరు 2 అర్ధరాత్రి ముంబయి క్రూయిజ్ నౌకలో జరిగిన డ్రగ్స్‌ పార్టీలో ఆర్యన్‌ సహా 20 మందిని ఎన్​సీబీ అధికారులు అరెస్టు చేశారు. నిషేధిత డ్రగ్స్ కలిగి ఉండటం, వినియోగం, అమ్మకం, కొనుగోలుకు సంబంధించి ఎన్​సీబీ సెక్షన్ల కింద వీరిపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆర్యన్‌తోపాటు మరో ఇద్దరు బెయిల్‌పై విడుదలయ్యారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.