ETV Bharat / bharat

రైల్వే, కేంద్ర బలగాలపై కరోనా పంజా! - రైల్వే ఉద్యోగులకు కరోనా

రైల్వేలో కరోనా బారిన పడి ఇప్పటివరకు 1,952 మంది ఉద్యోగులు చనిపోయారని బోర్డు ఛైర్మన్​ సునీత్​ శర్మ తెలిపారు. మరోవైపు... కేంద్ర బలగాల్లోనూ కరోనా కలవరం రేపుతోంది. ఇప్పటివరకు 108 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లు కరోనా కారణంగా కన్నుముశారని అధికారులు చెబుతున్నారు.

corona
రైల్వే, కేంద్ర బలగాల్లో కరోనా విలయం!
author img

By

Published : May 11, 2021, 6:41 AM IST

Updated : May 11, 2021, 7:01 AM IST

రైల్వే శాఖపై కొవిడ్​ పంజా విసురుతోంది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 1,952 మంది ఉద్యోగులు మృతి చెందారని రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్​ శర్మ తెలిపారు. ప్రతిరోజు దాదాపు 1,000 మంది ఉద్యోగులు కరోనా బాధితులుగా మారుతున్నారని వెల్లడించారు. రైల్వే ఉద్యోగుల సంరక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

"ప్రతిరోజు దాదాపు 1,000 మందికి కరోనా సోకుతోంది. మాకు మా ఆస్పత్రులు ఉన్నాయి. పడకల సంఖ్యను పెంచాం. ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ ప్లాంట్లను ఏర్పాటు చేశాం. మా సిబ్బంది సంరక్షణ కోసం మేం చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు మా ఆస్పత్రుల్లోని 4,000 పడకలు మా సంస్థ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో నిండిపోయాయి. వారు త్వరగా కోలుకోవడానికి మేం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. గతేడాది మార్చి నుంచి శనివారం వరకు 1,952 మంది ఉద్యోగులు కరోనా బారిన పడి కన్నుమూశారు."

-సునీత్​ శర్మ, రైల్వే బోర్డు ఛైర్మన్​

ఇప్పటివరకు రైళ్ల ద్వారా 295కుపైగా ట్యాంకర్లతో 4,700 టన్నుల మెడికల్​ ఆక్సిజన్​ను వివిధ రాష్ట్రాలకు తరలించామని సునీత్​ శర్మ చెప్పారు.

సీఆర్​పీఎఫ్​లో 108 మంది..

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే బలగాల్లో అత్యధిక కొవిడ్​ మరణాలు సెంట్రల్​ రిజర్వ్​ పోలీస్​ ఫోర్స్​(సీఆర్​పీఎఫ్​) విభాగంలో నమోదయ్యాయి. సోమవారం నాటికి మొత్తం 108 మంది సిబ్బంది కొవిడ్ ధాటికి ప్రాణాలు కోల్పోయారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

సీఆర్​పీఎఫ్​, బీఎస్​ఎఫ్​, సీఐఎస్​ఎఫ్​, ఐటీబీపీ, ఎస్​ఎస్​బీ, ఎన్​ఎస్​జీ, ఎన్​డీఆర్​ఎఫ్​ విభాగాల్లో కలిపి మొత్తం 271 మంది కరోనా కారణంగా మరణించారు. ఈ ఏడు కేంద్ర బలగాల్లో 763 మందికి కొత్తగా కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 71,295కు చేరింది. ప్రస్తుతం 9,464 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 61,560 మంది.. కరోనా నుంచి కోలుకున్నారు.

తమ సిబ్బందిలో దాదాపు 100 శాతం మందికి కరోనా టీకా మొదటి డోసు అందించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: 'సైలెంట్ మోడ్​లోకి వెళ్లిన మోదీ, షా'

ఇదీ చూడండి: ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్‌ ఇవ్వలేం: విజయన్‌

Last Updated : May 11, 2021, 7:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.