ETV Bharat / bharat

'హైకోర్టుల అనుమతి ఉంటేనే నేతలపై​ కేసులు వాపస్'

author img

By

Published : Aug 10, 2021, 12:25 PM IST

Updated : Aug 10, 2021, 3:05 PM IST

హైకోర్టుల అనుమతి ఉంటేనే నేతలపై కేసులు వాపస్​ తీసుకోవాలని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. చట్టసభ సభ్యులపై నమోదైన కేసుల పర్యవేక్షణకు ప్రత్యేక బెంచ్​ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపింది. చట్టసభ్యుల కేసుల విచారణను వేగంగా జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది సుప్రీం.

Supreme Court
సుప్రీం కోర్టు

చట్టసభ సభ్యులపై నమోదైన క్రిమినల్​ కేసులను హైకోర్టుల అనుమతి లేకుండా దర్యాప్తు అధికారులు ఉపసంహరించరాదని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల పర్యవేక్షణకు సుప్రీం కోర్టులో ఓ ప్రత్యేక బెంచ్​ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ తెలిపారు.

చట్టసభ్యులపై దాఖలైన కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టుల న్యాయమూర్తులను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు బదిలీ చేయరాదని స్పష్టం చేసింది ధర్మాసనం. ప్రత్యేక కోర్టుల్లో చట్టసభ సభ్యులపై ఉన్న కేసులు, పెండింగ్​లో ఉన్నవి, తీర్పులు వచ్చిన వాటిపై సమాచారం అందించాలని హైకోర్టుల రిజిస్ట్రార్​ జనరల్​లను ఆదేశించింది. సీనియర్​ న్యాయవాదులు విజయ్​ హన్సారియా, స్నేహ కలిత నుంచి నివేదికలు అందిన క్రమంలో ఈ ఆదేశాలిచ్చింది.

ఈ కేసులో స్టేటస్‌ రిపోర్టు అందించేందుకు కేంద్రం 2 వారాల గడువు కోరగా సీజేఐ జస్టిస్‌ ఎన్​వీ రమణ అసహనం వ్యక్తం చేశారు. స్టేటస్‌ రిపోర్టు అందించేందుకు అంత సమయం ఎందుకని ప్రశ్నించారు. రెండు వారాల గడువు ఇస్తున్నామని, ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు. అలోగా స్టేటస్‌ రిపోర్టు దాఖలు చేసి ప్రతివాదులందరికీ అందజేయాలని స్పష్టం చేశారు.

ఈ నెల 25న మళ్లీ విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు సీజేఐ.

ఇదీ చూడండి: 'పెగసస్​'పై విచారణ ఈనెల 16కు వాయిదా

Last Updated : Aug 10, 2021, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.