ETV Bharat / bharat

నిశ్చితార్థం రోజునా శ్మశానంలో విధులు! - గుజరాత్​ వల్సాద్​ జిల్లా వార్తలు కొవిడ్​

నిశ్చితార్థం కంటే మానవత్వానికే ప్రాధాన్యం ఇచ్చాడు ఆ యువకుడు. కాటికాపరిగా పనిచేస్తున్న ఆ వ్యక్తి నిశ్చితార్థం రోజున కూడా కొవిడ్​తో మృతిచెందిన వారి శవాలకు అంత్యక్రియలు నిర్వహించి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

అంత్యక్రియలు నిర్వహిస్తున్న గౌరవ్
అంత్యక్రియలు నిర్వహిస్తున్న గౌరవ్
author img

By

Published : May 4, 2021, 2:08 PM IST

గుజరాత్​లోని వల్సాద్​ జిల్లా పార్దీ గ్రామంలో నివసించే ఓ కాటికాపరి మానవత్వం చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. జరుగుతున్న తన నిశ్చితార్ధాన్ని విడిచి.. గౌరవ్​ పటేల్​ కరోనా రోగులకు అంత్యక్రియలు నిర్వహించాడు. గతనెల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఏప్రిల్​ 26న గౌరవ్​ పటేల్​ నిశ్చితార్థం. ఇంతలో శ్మశాన వాటికకు కరోనా కారణంగా మృతి చెందిన ముగ్గురి మృతదేహాలు వచ్చాయి. అయితే దహనసంస్కారాలు నిర్వహించేందుకు వినియోగించే యంత్రాలలో లోపం తలెత్తింది. దీంతో శ్మశాన వాటిక కార్యదర్శి సంజయ్​ బరియా.. గౌరవ్​కు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే నిశ్చితార్థానికి ధరించిన దుస్తులతోనే గౌరవ్​ హుటాహుటిన శ్మశానానికి చేరుకున్నాడు. సమస్యను పరిష్కరించి, స్వయంగా దహనసంస్కారాలను నిర్వహించాడు.

గత మూడేళ్లగా గౌరవ్​ విధులు నిర్వహిస్తున్నాడని సంజయ్​ వెల్లడించారు. గౌరవ్​ తండ్రి కమలేశ్​భాయ్​ కూడా పల్సానా గ్రామంలో గత 20 ఏళ్లుగా కాటికాపరిగా పని చేస్తున్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి : బిహార్​లో మే 15 వరకు లాక్​డౌన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.