కర్ణాటక శివమొగ్గలో భారీ వర్షాల కారణంగా ఓ వృద్ధురాలి అంత్యక్రియలు నిర్వహించడం ఇబ్బందిగా మారింది. దీంతో బంధువులు, గ్రామ ప్రజలు కలిసి ఆమె భౌతిక కాయానికి టార్పాలిన్ కింద దహన సంస్కారాలు చేశారు.
అసలేం జరిగిందంటే: శివమొగ్గ జిల్లా హునసవల్లి గ్రామానికి చెందిన భవానియమ్మ(70) అనే వృద్ధురాలు అనారోగ్యంతో మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అయితే వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తోంది. ఆ గ్రామానికి శ్మశానం లేదు. చేసేదేమీలేక టార్పాలిన్ వేసి దాని కిందే వృద్ధురాలి అంత్యక్రియలను పూర్తి చేశారు. దీంతో ఇకనైనా ప్రభుత్వం స్పందించి శ్మశానాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
హునసవల్లి గ్రామంలో శ్మశానం లేదు. కొన్ని రోజులు క్రితం శ్మశానానికి స్థలాన్ని గుర్తించి ప్రభుత్వ అధికారులకు గ్రామస్థులు తెలియజేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. అధికారులు సర్వే నంబరు మార్చి వేరే ప్రదేశంలో శ్మశానం నిర్మిస్తామన్నారు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: 'వచ్చే 25 ఏళ్ల భవిష్యత్‌ను నిర్మించుకోవాల్సిన సమయమిది'
కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. మైనర్‌పై గ్యాంగ్‌రేప్.. కార్ రైడ్‌కు తీసుకెళ్లి ఎస్సై..!