మధ్యప్రదేశ్ జబల్పుర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో కొత్తగా క్రీమ్ ఫంగస్ కేసు వెలుగుచూసింది. అయితే.. ఇది ప్రాణాంతకం కాదని నిపుణులు చెబుతున్నారు. అత్యంత ప్రమాదకారి బ్లాక్ ఫంగసేనని అని అభిప్రాయపడ్డారు.
పర్యవేక్షణలో 150 మంది..
జబల్పుర్లో దాదాపు 150 మంది శీలీంద్ర వ్యాధుల కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు స్పష్టం చేశారు. జబల్పుర్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో 100 మంది చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. 50 మంది ఇతర ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.
మరోవైపు, బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం వైద్య పరికరాలు, ఔషధాలను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. ఔషధాల రవాణా కోసం హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది.
ఇదీ చదవండి:20 రోజులుగా స్థిరంగా తగ్గుతున్న కరోనా