Crack On Railway Track : ఓ రైతు వేల మంది రైలు ప్రయాణికుల ప్రాణాలను రక్షించాడు. రైల్వే ట్రాక్‌పై పగుళ్లను గుర్తించి.. రైలు ప్రమాదం జరగకుండా నిలువరించాడు. రైలును ఆపాలని ఎర్రని వస్త్రాన్ని లోకో పైలట్‌కు చూపుతూ.. భారీ ప్రమాదం నుంచి గట్టెక్కించాడు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ నుంచి లఖ్‌నవూకు బయలుదేరిన గోమతి ఎక్స్‌ప్రెస్‌కు ఈ ప్రమాదం తప్పింది.
ప్రయాగ్ రాజ్ జిల్లాలోని భోలా కా పూర్వ గ్రామానికి చెందిన భన్వర్ సింగ్ అనే రైతు తన పొలం వైపు వెళుతుండగా.. లాల్‌గోపాల్‌గంజ్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై పగుళ్లను గుర్తించాడు. అప్పుడే అటుగా వస్తున్న రైలును సైతం గమనించాడు. వెంటనే అప్రమత్తమై ఎర్రని వస్త్రాన్ని చూపుతూ.. రైలును ఆపాలని లోకోపైలట్‌కు సంకేతాలిచ్చాడు. రైతు ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న లోకోపైలట్.. రైలు వేగానికి బ్రేకులు వేసి నిదానంగా దాన్ని ఆపాడు.
![Crack On Railway in uttarpradesh Track farmer stopped train by showing red garment after seeing cracks on track](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-08-2023/up-pra-1-train-break-vis-10070_04082023103438_0408f_1691125478_207.jpg)
![crack-on-railway-in-uttarpradesh-track-farmer-stopped-train-by-showing-red-garment-after-seeing-cracks-on-track](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-08-2023/19180265_1.png)
అనంతరం పట్టాలపై పగుళ్లను లోకోపైలట్‌కు చూపించాడు భన్వర్ సింగ్. ఘటనపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన లోకోపైలట్.. రైతు భన్వర్ సింగ్‌ను అభినందించాడు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడేసినందుకు రైతుకు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా పట్టాలపై పగుళ్ల కారణంగా ఆ మార్గంలో కాసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టాలకు మరమ్మతులు పూర్తయిన అనంతరం రైళ్ల రాకపోకలు సాఫీగా సాగాయి.
![Crack On Railway in uttarpradesh Track farmer stopped train by showing red garment after seeing cracks on track](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-08-2023/up-pra-1-train-break-vis-10070_04082023103438_0408f_1691125478_818.jpg)
తప్పిన భారీ ప్రమాదం.. రెండు భాగాలుగా విడిపోయిన ఎక్స్‌ప్రెస్ రైలు.. చివరకు..
నెల రోజుల క్రితం కూడా బిహార్‌లోని కతిహార్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. లోహిత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఒక్కసారిగా రెండు భాగాలుగా విడిపోయింది. ఇంజిన్ నుంచి సుమారు 10 బోగీలు విడిపోయి పట్టాల మీద నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. బంగాల్లోని నార్త్ దినాజ్‌పుర్ జిల్లాలోని ఉన్న దల్ఖోలా స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. కోచ్ నుంచి బోగీలు విడిపోయాక.. అనేక మంది ప్రయాణికులు రైలు నుంచి దూకేశారు. అనంతరం విడిపోయిన బోగీలను మళ్లీ ఇంజిన్‌కు జతచేసి.. రైలు ప్రారంభించారు అధికారులు. కాగా ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.