బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో యువతకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సీపీఎం(భారత కమ్యునిస్టు పార్టీ-మార్క్సిస్ట్) భావిస్తున్నట్లు తెలుస్తోంది. యువ నేతలకే ఎక్కువ సీట్లు కేటాయించాలని యత్నిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న అయిషే ఘోష్, దిప్సితా ధార్ వంటి నేతలకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో పార్టీ చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఇరువురు నేతలు సమర్థంగా నడిపించారు. అయిషే, దీప్సితకు పార్టీకి అవసరమైన నైపుణ్యాలు ఉన్నాయని సీపీఎం వర్గాలు చెబుతున్నాయి.
వీరిరువురికి అసెంబ్లీ టికెట్ ఇచ్చే విషయంపై అంతర్గతంగా చర్చలు జరుపుతామని వామపక్ష కూటమి ఛైర్మన్ బిమాన్ బసు తెలిపారు. ఈ నెల చివర్లో బ్రిగేడ్ మీటింగ్ నిర్వహించిన తర్వాత పార్టీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'బంగాల్‌కు కావాల్సింది తమ సొంత కూతురే'