CoWin Data Leak: కొవిన్ పోర్టల్‌లో డేటా లీకైందంటూ దేశవ్యాప్తంగా వార్తలు సంచలనమయ్యాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ క్లారిటీ ఇచ్చింది. ఏ ఒక్కరి వ్యక్తిగత సమాచారం లీక్ కాలేదని స్పష్టం చేసింది. కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం ప్రజల వ్యక్తిగత చిరునామా, ఆర్టీపీసీఆర్ టెస్టు ఫలితాలు సేకరించలేదని తెలిపింది.
వేలమంది డేటా..!
కొవిన్ యాప్‌లో రిజిస్టర్ అయిన వేలమంది వ్యక్తిగత డేటా లీకైందని తొలుత వార్తలు విస్తృతమయ్యాయి. మొబైల్ నంబర్, కొవిడ్ రిజల్ట్, అడ్రస్ సహా అన్ని వివరాలు అమ్మకానికి పెట్టారని ప్రచారం జరిగింది. 20 వేల మందికి పైగా వ్యక్తుల డేటా 'రైడ్ ఫోరమ్స్' వెబ్‌సైటులో సైబర్ నిందితుడు అమ్మకానికి పెట్టాడని వార్తా కథనాలొచ్చాయి. దీనిపై సైబర్ భద్రత నిపుణుడు రాజశేఖర్ రాజాహరియా ట్వీట్ చేశారు. వ్యక్తుల పేర్లు, మొబైల్ నంబర్లు, ఆర్టీ-పీసీఆర్ ఫలితాలతో ఉన్న జాబితాలను 'డార్క్‌వెబ్'లో అమ్మకానికి పెట్టినట్లు రాజాహరియా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఇకనుంచి ఆరుగురు..
కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం ఒక మొబైల్ నంబర్‌తో నలుగురు మాత్రమే రిజిస్టర్ అయ్యే నిబంధనలో మార్పు తీసుకొచ్చింది ఆరోగ్య శాఖ. ఇకనుంచి కొవిన్ యాప్‌లో ఒక నంబర్‌పై ఆరుగురు రిజిస్టర్ అవ్వొచ్చని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: