ETV Bharat / bharat

జాతీయ జంతువుగా 'గోవు'.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు - గోవధ కేసులు

జాతీయ జంతువుగా ఆవును ప్రకటించాలని అలహాబాద్​ హైకోర్టు(Allahabad High Court) కేంద్రానికి సూచించింది. దీనిపై పార్లమెంట్​లో ప్రత్యేక చట్టం చేయాలని కోరింది. గోవధ కేసులో నిందితుడి బెయిల్​ పిటిషన్​పై విచారణ చేపట్టిన కోర్టు​ ఈ వ్యాఖ్యలు చేసింది.

national animal Cow
జాతీయ జంతువుగా ఆవు
author img

By

Published : Sep 2, 2021, 7:19 AM IST

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని అలహాబాద్​ హైకోర్టు(Allahabad High Court)​ కేంద్రానికి సూచించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక చట్టం చేయాలని పేర్కొంది. ఆవుకు హాని చేసేవారిని కఠినంగా శిక్షించేలా చట్టాన్ని రూపొందించాలని తెలిపింది.

భారతీయ సంస్కృతిలో ఆవు చాలా ముఖ్యమైందని జస్టిస్​ శేఖర్​ కుమార్ యాదవ్​ అభిప్రాయపడ్డారు. అంతేగాకుండా ఆవు మాంసం తినడం అనేది ఎవరికీ ప్రాథమిక హక్కుకాదని తెలిపిన కోర్టు​.. దానిని పూజించడంమే కాక దానిపై ఆధారపడి జీవనం సాగించే వారికి ప్రాథమిక హక్కుగా పరిగణించాలని కోరారు. ఇందుకు సంబంధించిన చట్టానికి రూపకల్పన చేయాలని ఆదేశించింది న్యాయస్థానం.

గోవధ కేసులో నిందితుడు అయిన జావెద్​ అనే వ్యక్తికి బెయిల్​ నిరాకరించిన ధర్మాసనం ఆ వ్యాఖ్యలు చేసింది. ఆవును చంపి తనడం అనేది ప్రాథమికం హక్కుగా పరిగణించలేమని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. జావెద్​ ఇది వరకు కూడా గోవధకు పాల్పడినట్లు పేర్కొన్న కోర్టు.. నిందితుడు చేసిన పని సమాజంలో ఉన్న మత సామరస్యాన్ని దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించింది.

ఇదీ చూడండి: వలలో చిక్కిన అరుదైన చేపలు.. ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.