కామంతో కళ్లుమూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు కొందరు. వావీ వరుసలు లేకుండా మానవ సమాజానికి కళంకంగా మారుతున్నారు. మూగజీవాలను సైతం వదలని సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో శునకంపై అత్యాచారం చేసిన వార్త మరువక ముందే హరియాణా సోనీపత్ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. ఓ యువకుడు ఆవుపై అత్యాచారం చేశాడు.
ఇదీ జరిగింది..
జిల్లాలోని లివాస్పుర్ గ్రామంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు నివసిస్తున్నాడు. ఇటీవల ఓ ఆవుపై యువకుడు అత్యాచారం చేశాడు. ఇది గమనించిన గ్రామస్థులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆవు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: చట్టానికి తరతమ భేదాలేమీ ఉండవు కదా.. మరి వీరి సంగతేంటి?