ETV Bharat / bharat

'కేంద్రం, రాష్ట్రాల వ్యాక్సిన్ ధరల్లో తేడాలెందుకు?' - కొవిడ్​ కట్టడి చర్యలపై సుప్రీం కోర్టు విచారణ

కరోనా కట్టడి చర్యలపై సుప్రీం కోర్టులో విచారణ చేపట్టింది జస్టిస్ చంద్రచూడ్​ నేతృత్వంలోని ధర్మాసనం. కేంద్రం, రాష్ట్రాల వ్యాక్సిన్ ధరల్లో తేడా ఎందుకు ఉందని ప్రశ్నించింది.

supreme court
సుప్రీం కోర్టు
author img

By

Published : Apr 30, 2021, 1:37 PM IST

కొవిడ్ టీకాల కొనుగోలులో భాగంగా.. కేంద్రం, రాష్ట్రాల వ్యాక్సిన్ ధరల్లో తేడా ఎందుకు ఉందని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు కరోనా కట్టడి చర్యలపై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టిన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. పలు అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.

మీనాక్షి అరోరా, జైదీప్ గుప్తా అమికస్ క్యూరీగా హాజరయ్యారు. టీకాలు మొత్తం కేంద్రమే ఎందుకు కొనడం లేదని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. రాష్ట్రాలకు ఆక్సిజన్ కేటాయింపులను తెలపాలన్న సుప్రీంకోర్టు.. లాక్‌డౌన్ తరహా ఆంక్షలు, చర్యల వివరాలు అడిగింది. నిరక్షరాస్యులకు వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని...నిరుపేదలు, నిరక్షరాస్యులకు నెట్ సౌకర్యం ఉందా? అని ప్రశ్నించింది. శ్మశానవాటిక సిబ్బందికి వ్యాక్సినేషన్‌పై ఏంచేస్తున్నారన్న ధర్మాసనం.. పేటెంట్ చట్టంలోని సెక్షన్-92ను కేంద్రం అమలు చేస్తోందా అని ప్రశ్నించింది. టీకాలను కేంద్రమే సేకరించి పంపిణీ చేయొచ్చు కదా? అని అడిగింది. జాతీయ టీకాల విధానాన్ని ఎందుకు పాటించట్లేదని ప్రశ్నించింది.

కేంద్రానికి సుప్రీం సంధించిన ప్రశ్నలు..

  • వ్యాక్సిన్​ డోసులను 100 శాతం కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయడం లేదు?
  • కేంద్రం, రాష్ట్రాలకు అమ్మే ధరల్లో వ్యత్యాసం ఎందుకు ఉంది?
  • నేషనల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం పాలసీ ప్రకారం ఎందుకు నడుచుకోవడం లేదు?
  • ఆ మేరకు సేకరణ పూర్తిగా కేంద్రమే చేపట్టి, పంపిణీ వికేంద్రీకరించవచ్చు కదా?
  • వ్యాక్సిన్ డోసులు అందుకునే క్రమంలో కొన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత లభిస్తుందా?
  • వ్యాక్సిన్ తయారీదారులు డోసులను అందించే క్రమంలో ఎలా సమానత్వాన్ని ప్రదర్శించగలరు?
  • 18-45 మధ్య దేశ జనాభా ఎంత అనేది కేంద్రం అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొనాలి
  • వ్యాక్సిన్ ఉత్పత్తి పెంపులో కేంద్రం పెట్టుబడి వివరాలు చెప్పాలి
  • కరోనా చికిత్స ధరలను కేంద్రం ఏ విధంగా నియంత్రిస్తోంది? లేక రాష్ట్రాలకే వదిలివేసిందా?
  • ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఉంటే తాత్కాలిక చికిత్స కేంద్రాలను ఏ మార్గదర్శకాల ప్రకారం ఏర్పాటు చేస్తున్నారు?
  • వైద్య సిబ్బంది కొరతను ఎలా అధిగమిస్తారు?
  • కరోనా చికిత్స చేస్తున్న వైద్యులు మహమ్మారి బారిన పడితే వారిని ఎలా రక్షిస్తారు?

పౌరులు సోషల్ మీడియా, ఇంటర్నెట్ వేదికగా సహాయం కోరడాన్ని తప్పుడు సమాచారం అనలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. కరోనా వేళ సాయం కోరుతూ వచ్చే ట్వీట్లు, ఫేస్ బుక్ పోస్టులను ఆపాలని అనుకోవడం లేదని స్పష్టం చేసింది. అలాంటి పోస్టులపై చర్యలు తీసుకుంటే కోర్టు ధిక్కరణ చర్యగా భావించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. అన్ని రాష్ట్రాల డీజీపీలకు ఈ సమాచారం వెళ్లాలని, సమాచారాన్ని అదుపు చేయడం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.