ETV Bharat / bharat

'టీకా తీసుకుంటే నా 8 మంది పిల్లలేంగాను?'.. వీడియో వైరల్​

Covid Vaccine Rejected: కరోనా వ్యాక్సిన్ వద్దంటూ ఓ వృద్ధుడు హంగామా సృష్టించిన ఘటన తమిళనాడు తిరుపత్తూరు జిల్లాలో జరిగింది. అందరికీ టీకా అందాలనే ఉద్దేశంతో గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ క్రమంలో టీకా వేయడానికి వెళ్లిన వారిని చూసిన ఆ వ్యక్తి హల్​చల్ చేశాడు.

vaccine
టీకా
author img

By

Published : Jan 30, 2022, 1:49 PM IST

'వ్యాక్సిన్ తీసుకుంటే నా పిల్లలేంగాను?'.. వీడియో వైరల్​

Covid Vaccine Rejected: కరోనా నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సిన్ ఏకైక మార్గమని వైద్యాధికారులు చెబుతుంటే.. టీకా వేసుకోనని ఓ వృద్ధుడు హంగామా సృష్టించాడు. ఈ ఘటన తమిళనాడు తిరుపత్తూరు జిల్లా పురికమనిమిట్ట గ్రామం​లో జరిగింది.

ఇళ్లు ఇవ్వలేదు..

గ్రామాల్లో వంద శాతం వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ టీకాల కార్యక్రమం చేపడుతున్నారు. పురికమనిమిట్ట గ్రామంలో మొత్తం 1,159 మంది ఉండగా.. 1,158 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇంకా కుడియన్​(60) అనే ఒక్క వ్యక్తి మాత్రమే మిగిలి ఉన్నాడు. టీకా వేయడానికి సిబ్బంది అతని ఇంటికి వెళ్లగా.. తాను టీకా తీసుకోబోనని హంగామా చేశాడు. తనకు ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేదని వాపోయాడు. కుల ధ్రువీకరణ పత్రం కూడా పొందలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. మధుమేహంతో బాధపడుతున్నానని చెప్పాడు. తన ఎనిమిది మంది పిల్లలను ఎవరు పోషిస్తారని ప్రశ్నించాడు. కుడియన్ డిమాండ్లను పరిష్కరిస్తానని స్థానిక సర్పంచ్ పరమశివమ్​ హామీ ఇస్తే.. చివరికి వ్యాక్సిన్ తీసుకున్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం.. భారీగా మరణాలు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.