కరోనా టీకా పొందడం స్వచ్ఛందమని.. అయితే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడం కోసం యాంటీబాడీలు వృద్ధిచెందాలంటే కచ్చితంగా రెండు డోసులు తీసుకోవాలని వెల్లడించారు ఎయిమ్స్ డైరక్టర్ డా. రణదీప్ గులేరియా వెల్లడించారు. రెండో డోసు తీసుకున్న 2వారాలకు యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చేసిన టీకాలకు దీటుగా భారత్‌లో వినియోగించనున్న వ్యాక్సిన్లు ఉండనున్నాయని అభిప్రాయపడ్డారు గులేరియా. వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై ప్రశ్నోత్తరాల కోసం రూపొందించిన వీడియోలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోను కేంద్ర ఆరోగ్యశాఖ వెబ్సైట్లో పోస్ట్ చేశారు.
వైరస్ సోకినా, సోకకపోయినా.. టీకా డోసులను షెడ్యూల్ ప్రకారం తీసుకుంటే మంచిదని సూచించారు గులేరియా. దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందన్నారు.
యాక్టివ్, సింప్టొమాటింక్ కొవిడ్-19 రోగులు టీకా తీసుకోవడాన్ని 14రోజులకు వాయిదా వేసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఒంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు టీకా కేంద్రానికి వెళితో ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఉండటమే ఇందుకు కారణమన్నారు.
ఇదీ చూడండి:- దేశంలో కొత్తగా 18,088 కరోనా కేసులు..264 మరణాలు