ETV Bharat / bharat

70,000 మంది ఉద్యోగులకు ఎన్​టీపీసీ టీకా - spice zet tika drive form may 17

తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కలిపి 70,000 మందికి టీకా అందించినట్లు విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్​టీపీసీ ప్రకటించింది. మరోవైపు.. మే 17న తమ ఉద్యోగుల కోసం టీకా డ్రైవ్‌ను ప్రారంభిస్తామని స్పైస్ జెట్ తెలిపింది.

NTPC
ఎన్టీపీసీ
author img

By

Published : May 12, 2021, 6:34 PM IST

తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో కలిపి 70,000 మందికి పైగా వ్యాక్సిన్ అందించినట్లు ఎన్​టీపీసీ ప్రకటించింది. రాష్ట్రాల్లోని ఎన్​టీపీసీ కార్యనిర్వహక వర్గాల సమన్వయంతో.. ప్లాంట్లలోనే టీకా ప్రక్రియ చేపడుతున్నట్లు పేర్కొంది. సంస్థలోని ఫ్రంట్ లైన్ వర్కర్ లతో పాటు ప్రాధాన్యం ఆధారంగా వ్యాక్సిన్ అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో పాటు వ్యాధి బారిన పడిన ఉద్యోగులకు సహకారం అందించడానికి టాస్క్ ఫోర్స్​ను ఏర్పాటు చేశామని తెలిపింది.

స్పైస్ జెట్ టీకా డ్రైవ్..

మే 17న తమ ఉద్యోగుల కోసం టీకా డ్రైవ్‌ ప్రారంభిస్తామని స్పైస్ జెట్ తెలిపింది. ఈ డ్రైవ్.. స్పైస్ జెట్ ప్రధాన కార్యాలయం దిల్లీ, గుర్ గ్రామ్ నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది. తమ నెట్‌వర్క్‌లోని అన్ని స్టేషన్లలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటనలో తెలిపింది. దాదాపు 15 వేల మంది ఉద్యోగులున్నారని స్పైస్ జెట్ వెల్లడించింది.
ఇదీ చదవండి: కొవిడ్ అనంతర ఆరోగ్య సమస్యలను అధిగమించండిలా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.