ETV Bharat / bharat

'ఆ ఔషధాలు వాడొద్దు'.. కేంద్రం అలర్ట్.. కొత్త మార్గదర్శకాలు ఇవే.. - కరోనా కొత్త మార్గదర్శకాలు

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం.. కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్ చికిత్సలో వాడాల్సిన, వాడకూడని ఔషధాల వివరాలు వెల్లడించింది.

covid treatment guidelines 2023
covid treatment guidelines 2023
author img

By

Published : Mar 20, 2023, 5:01 PM IST

కొవిడ్ చికిత్సలో యాంటీ బయాటిక్ ఔషధాలు ఉపయోగించకూడదని దేశంలోని వైద్యులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. రోగిలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తలెత్తినట్లు అనుమానాలు వస్తేనే యాంటీబయాటిక్స్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వయోజనులకు కరోనా చికిత్సకు సంబంధించి సవరించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఈ మార్గదర్శకాలు రావడం గమనార్హం.

మార్గదర్శకాల సవరణ కోసం ఎయిమ్స్/ ఐసీఎంఆర్ కొవిడ్ నేషనల్ టాస్క్​ఫోర్స్ జనవరి 5న భేటీ అయింది. లూపినవిర్, రిటోనవిర్, హైడ్రాక్సీక్లోరోక్విన్, ఐవర్​మెక్టిన్, మోల్నుపిరవిర్, ఫావిపిరవిర్, అజిథ్రోమైసిన్, డాక్సీసైక్లిన్ ఔషధాలను కొవిడ్ రోగులకు ఇవ్వొద్దని తాజా మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టం చేసింది. ప్లాస్మా థెరపీని సైతం చేయవద్దని మార్గదర్శకాల్లో సూచించింది. రోగులకు కరోనాతో పాటు ఇతర అంటు వ్యాధులు ఏమైనా సోకుతున్నాయా అనే విషయాన్ని గమనిస్తూ ఉండాలని వైద్యులను అప్రమత్తం చేసింది.

"రోగికి కరోనాతో పాటు ఇతర వ్యాధులు ఉంటే ఐదు రోజుల వరకు రెమిడెసివిర్ ఇవ్వవచ్చు. వ్యాధి లక్షణాలు 10 రోజుల పాటు సాధారణం నుంచి తీవ్రస్థాయిలో ఉంటే.. ఈ ఔషధం ఇవ్వడం ప్రారంభించాలి. ఐదు రోజులకు మించి రెమిడెసివిర్ ఇవ్వడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. వెంటిలేషన్/ ఎక్మోపై ఉన్న రోగులకు వీటిని ఇవ్వకూడదు. ఇంట్లో చికిత్స చేసుకునేవారికి ఈ ఔషధం సిఫార్సు చేయకూడదు."
-కేంద్రం మార్గదర్శకాలు

'రోగికి వ్యాధి తీవ్రంగా లేదా మధ్యస్థంగా ఉండి.. వేగంగా వృద్ధి చెందుతున్నట్లైతే.. టోసిలిజుమాబ్ ఔషధాన్ని ఇవ్వడాన్ని పరిశీలించాలి. రోగి తీవ్రంగా ప్రభావితమైన/ ఐసీయూలో అడ్మిట్ అయిన 24-48 గంటల్లోగా ఈ ఔషధాన్ని ఇవ్వాలి' అని కేంద్రం వివరించింది.

దేశంలో కొత్తగా 918 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 6,350కు చేరింది. కేంద్ర వైద్య శాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో మరో నాలుగు కరోనా మరణాలు సంభవించాయి. రాజస్థాన్​లో రెండు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఒక్కో మరణం నమోదైంది. దీంతో ఇప్పటివరకు కొవిడ్​తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,30,806కు చేరింది.
ఆదివారం ఏకంగా వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు రావడం 129 రోజుల తర్వాత ఇదే తొలిసారి.

మరోవైపు, దేశంలో పాజిటివిటీ రేటు 2.08 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.86 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతమేనని హెల్త్ మినిస్ట్రీ వెబ్​సైట్ స్పష్టం చేసింది. ఇక ఆదివారం 44,225 కరోనా టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.65 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.