ETV Bharat / bharat

Third Wave In India: 'వచ్చే ఏడాది ప్రారంభంలో కరోనా థర్డ్​ వేవ్​' - థర్డ్​వేవ్​లో కేసులు

Third Wave In India: ఒమిక్రాన్ వేరియంట్​ కారణంగా దేశంలో వచ్చే ఏడాది ప్రారంభంలో థర్డ్​ వేవ్​ వచ్చే అవకాశం ఉందని జాతీయ కొవిడ్​-19 సూపర్​మోడల్ కమిటీ తెలిపింది. థర్డ్​ వేవ్​ కారణంగా దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతుందని చెప్పింది. దేశంలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని అంచనా వేసింది.

Covid third wave
కరోనా థర్డ్​ వేవ్
author img

By

Published : Dec 18, 2021, 7:16 PM IST

Third Wave In India: దేశంలో ప్రస్తుతం కరోనా రోజువారీ కేసులు సగటున 7,500 చొప్పున నమోదవుతున్నాయని జాతీయ కొవిడ్​-19 సూపర్​మోడల్ కమిటీ తెలిపింది. అయితే.. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా రానున్న రోజుల్లో ఈ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పింది. వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలో థర్డ్​ వేవ్​ వస్తుందని అంచనా వేసింది. థర్డ్​ వేవ్​ వచ్చినా.. దాని తీవ్రత సెకండ్ వేవ్​ కంటే స్వల్పంగానే ఉంటుందని పేర్కొంది.

"వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలో థర్డ్​ వేవ్​ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వచ్చినా.. అది సెకండ్ వేవ్ కంటే స్వల్పంగానే ఉంటుంది. ఎందుకంటే దేశంలో చాలామంది టీకా కారణంగా రోగ నిరోధక శక్తిని కలిగి ఉన్నారు. కచ్చితంగా థర్డ్​ వేవ్ ఉంటుంది. ప్రస్తుతం సగటున 7,500 కేసులు నమోదవుతున్నాయి. డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్​ ప్రబలంగా మారిన తర్వాత దేశంలో కరోనా కేసులు పెరుగుతాయి."

-విద్యాసాగర్​, జాతీయ కొవిడ్​-19 సూపర్​మోడల్ కమిటీ హెడ్​

Corona daily cases: "సెకండ్​ వేవ్​ కంటే థర్డ్​వేవ్​లో రోజువారీ కేసులు అత్యధిక స్థాయిలో నమోదవుతాయి. సాధారణ పౌరులకు టీకాలను వేయడాన్ని ప్రభుత్వం మార్చి 1 నుంచి ప్రారంభించింది. అది డెల్టా వేరియంట్​ విజృంభణ ప్రారంభమైన సమయం. ఆ సమయంలో ఫ్రంట్ లైన్ కార్మికులు కాకుండా వ్యాక్సిన్ తీసుకోనివారే... కరోనా కారణంగా ఎక్కువగా ప్రభావితమయ్యారు"అని విద్యాసాగర్ పేర్కొన్నారు. గతానుభవం దృష్ట్యా.. వైరస్​ను ఎదుర్కోవడానికి కావాల్సిన సామర్థ్యాలను పెంచుకున్నామని తెలిపారు.

ఇదీ చూడండి: స్పుత్నిక్‌ లైట్‌ బూస్టర్‌తో 'ఒమిక్రాన్‌' దూరం

'రెండు లక్షలు దాటవు'

Omicron india: దేశంలో కేసుల పెరుగుదల రెండు అంశాలపై ఆధారపడి ఉంటుందని విద్యాసాగర్ తెలిపారు. అందులో మొదటిది.. డెల్టా ద్వారా అందిన రోగ నిరోధక శక్తి, రెండోది.. వ్యాక్సినేషన్ ద్వారా అందిన రోగ నిరోధక శక్తి అని చెప్పారు. అయితే... ఒమిక్రాన్​పై టీకాల ప్రభావం గురించి సరైన సమాచారం లేదన్నారు. థర్డ్​ వేవ్​ ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ.. రోజువారీ కేసుల సంఖ్య 2 లక్షలను దాటదని పేర్కొన్నారు.

Omicron community spread: థర్డ్​వేవ్​లో దేశంలో లక్ష నుంచి రెండు లక్షల రోజువారీ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ప్యానెల్​లోని మరో సభ్యుడు మనీంద్ర అగర్వాల్​ తెలిపారు. ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి ఇప్పటికే ప్రారంభమైందని కమిటీ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించడమే అత్యంత ముఖ్యమని చెప్పింది. చికిత్స కంటే నివారణే మేలు అని పేర్కొంది.

ఇదీ చూడండి: India omicron variant: 'ఒమిక్రాన్'​తో మరో ముప్పు తప్పదా?

ఇదీ చూడండి: టీకా మూడు డోసులు తీసుకున్న వ్యక్తికి.. ఒమిక్రాన్ పాజిటివ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.