దేశంలోని అనేక ప్రాంతాల్లో కరోనా ఉద్ధృతి తగ్గుతున్నా.. దీన్ని కట్టడి చేయడంలో ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అనేక ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు, యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోందని, రికవరీ రేటు పెరుగుతోందని.. నీతి ఆయోగ్‌లో ఆరోగ్య రంగ సభ్యుడు వీకే పాల్ వెల్లడించారు.
గత 20 రోజులుగా యాక్టివ్ కేసులు తగ్గుతున్నట్లు వీకే పాల్ వివరించారు. సామాజిక, ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలు, కంటైన్‌మెంట్ చర్యల ద్వారా ప్రస్తుత స్థాయికి చేరుకున్నామని తెలిపారు. అయితే పరిస్థితులు మాత్రం మిశ్రమంగా ఉన్నాయని అన్నారు. దేశంలోని 382 జిల్లాల్లో పాజిటివిటీ రేటు ఇంకా 10శాతం ఉందని తెలిపారు.
మొత్తం మీద కరోనా ముప్పు తగ్గినా, ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై నిర్లక్ష్యం తగదని వీకే పాల్ హెచ్చరించారు. పరిస్థితి మెరుగుపడుతున్నా.. వైరస్ వ్యాప్తి గొలుసును తెంచేలా ప్రయత్నించాలని తెలిపారు.
ఇదీ చూడండి: 'కరోనా మహమ్మారి మరోమారు ఉగ్రరూపం'