కరోనా వ్యాప్తి నేపథ్యంలో దిల్లీలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం తెలిపారు. ఆక్సిజన్‌తో పాటుగా రెమ్‌డెసివిర్, తోసిలిజుమాబ్ ఔషధాల కొరత ఉందని చెప్పారు. ఈ అంశంపై తాను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో మాట్లాడానని పేర్కొన్నారు.
"దిల్లీలో కరోనా పరిస్థితుల గురించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో మాట్లాడాను. ఆక్సిజన్ సహా రెమ్‌డెసివర్, తోసిలిజుమాబ్ ఔషధాలను సరఫరా చేయాలని కోరాను. కరోనా బారిన పడే వారి సంఖ్య పెరగుతున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో పడకల పూర్తిగా నిండిపోతున్నాయి. అయితే.. మేం పడకల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం.
-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
దిల్లీలో శుక్రవారం ఒక్కరోజే 24,000 మంది వైరస్ బారిన పడగా.. అంతకుమందు రోజు ఈ సంఖ్య 19,400గా ఉందని కేజ్రీవాల్ గుర్తు చేశారు. రానున్న మూడు నాలుగు రోజుల్లో దిల్లీలో అదనంగా 6,000 పడకలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి:'అవసరమైతే కొవిడ్ బోగీలను వినియోగించుకోండి'