ఒడిశాలోని బోండా తెగ ప్రజలపై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటివరకు 12 మంది మహమ్మారి బారినపడ్డారు. మొదటి దశలో ఒక్క కేసూ నమోదుకాని మల్కాన్‌గిరి గిరిజన ప్రాంతంలో.. రెండో విడతలో మాత్రం క్రమంగా బాధితుల సంఖ్య పెరగడం అధికారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో దుర్బర జీవితాన్ని గడిపే గిరిజన తెగల్లో బోండా ఒకటి. సరైన ఆహార వసతి లేకపోవడం వల్ల.. వారిలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉండటం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన అధికారులు.. వైరస్‌పై అవగాహన కల్పిస్తూ ఇంటింటి సర్వే నిర్వహించి కరోనా పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్‌గా తేలిన వారి ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తులు నిర్బంధంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: 'ప్రతి పల్లెలో 30 పడకల కొవిడ్ కేర్ సెంటర్!'