కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టి న్యాయస్థానాల్లో మళ్లీ ప్రత్యక్ష విచారణలు(Physical Hearing In Court) మొదలవుతున్న నేపథ్యంలో కోర్టుల్లో రద్దీ నివారణకు నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్‌ఐసీ) ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెడుతోంది. 'కొవిడ్ మేనేజ్‌మెంట్ ప్యాచ్' అనే ఈ కార్యక్రమ సాయంతో అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తూ(Physical Hearing In Court) ఇంకా కాలవ్యవధి ఉన్న కేసులను వాయిదా వేయడం ద్వారా కోర్టు గదుల్లో రద్దీ ఏర్పడకుండా చూసేందుకు జడ్జీలకు వెసులుబాటు చిక్కుతుంది.
కేస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఐసీ) రూపొందించిన ఈ కార్యక్రమం ప్రణాళికాబద్ధంగా కేసుల వర్గీకరణలో సహాయకారిగా ఉంటుంది. జిల్లా కోర్టులు, సబార్డినేట్ కోర్టుల్లో కరోనా తీవ్రత పెరగకుండా చూసేందుకు ఇది దోహదపడుతుంది. సుప్రీంకోర్టు కమిటీ మార్గదర్శకత్వంలో పుణె ఎన్‌ఐసీ బృందం గతేడాది ఈ 'ప్యాచ్'ను అభివృద్ధి చేసింది.
ఇదీ చూడండి: 'న్యాయవ్యవస్థలో మహిళలకు 50% రిజర్వేషన్ అవసరం'