Covid jab message to dead woman: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహోబాలో మూడు నెలల కిందట చనిపోయిన మహిళకు.. తాజాగా కొవిడ్ టీకా రెండో డోసు ఇచ్చినట్లు మెసేజ్ రావడం వైద్య ఆరోగ్య శాఖలో కలకలం రేపుతుంది. ఈ ఘటనపై జిల్లా ప్రధాన వైద్యాధికారి డా. సుధాకర్ పాండే విచారణకు ఆదేశించారు. ఇందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
ఇదీ జరిగింది?
హెల్త్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన డెత్ సర్టిఫికెట్ ప్రకారం హేమలత అనే మహిళ సెప్టెంబర్ 21న కొవిడ్ కారణంగా మరణించింది. మూడు నెలలకు ఆమె కరోనా రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నట్లు మృతురాలి మేనల్లుడు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. అది చూసి ఆశ్చర్యపోయాడు సౌరవ్.
ఈ మెసేజ్ రాకమునుపు సౌరవ్ యాదవ్‌కు టీకా పంపిణీకి సంబంధించి జనవరి 15న వెరిఫికేషన్ కాల్ కూడా వచ్చింది. ఆ సమయంలో అతను హేమలత చనిపోయినట్లు వారికి సమాచారం అందించాడు. అయినా.. టీకా తీసుకున్నట్లు మళ్లీ మెసేజ్ రావడం చర్చనీయాంశంగా మారింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: భయపెడుతున్న థర్డ్ వేవ్.. సుడిగాలిలా ఒమిక్రాన్ విజృంభణ