దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 3,26,098 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి ధాటికి మరో 3890మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు: 2,43,72,907
- మొత్తం మరణాలు: 2,66,207
- కోలుకున్నవారు: 2,04,32,898
- యాక్టివ్ కేసులు: 36,73,802
శుక్రవారం 16,93,093 నమూనాను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఫలితంగా మే 14నాటికి చేసిన మొత్తం టెస్టుల సంఖ్య 31,30,17,193కి చేరినట్లు వెల్లడించింది.
కరోనాపై పోరులో భాగంగా ఇప్పటివరకు 18.04 కోట్ల డోసులను పంపిణఈ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం 11 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు తెలిపింది.
ఇదీ చదవండి: 'అంతర్జాతీయ సమాజం భారత్కు సాయపడాలి'