Covid Cases in India: దేశంలో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం 8 గంటల వరకు 16,299 మందికి వైరస్ సోకింది. పాజిటివిటీ రేటు 4.85 శాతానికి తగ్గింది. 24 గంటల వ్యవధిలో కొవిడ్ నుంచి 19,431 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.53 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.28 శాతానికి పడిపోయాయి.
- మొత్తం కేసులు: 4,42,06,996
- క్రియాశీల కేసులు:1,25,076
- కోలుకున్నవారు: 4,35,55,041
Vaccination India: భారత్‌లో బుధవారం 25,75,389 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 207.03 కోట్లు దాటింది. మరో 3,56,153మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 8,45,444 మంది వైరస్ బారినపడగా.. మరో 2,400 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 59,20,66,829కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో64,45,795 మంది మరణించారు. ఒక్కరోజే 10,23,728మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 56,38,74,034కు చేరింది.
- జపాన్‌లో కరోనా బీభత్సం కొనసాగుతోంది. కొత్తగా 1,96,732 కేసులు నమోదయ్యాయి. 250 మంది మరణించారు.
- దక్షిణ కొరియాలో 1,51,734 కేసులు వెలుగులోకి వచ్చాయి. 50మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో 95,530 కేసులు బయటపడ్డాయి. 429 మంది మరణించారు.
- జర్మనీలో 59,888 కరోనా కేసులు నమోదయ్యాయి. 153 చనిపోయారు.
కరోనాపై ఉత్తర కొరియా విజయం!: మూడు నెలల క్రితం కరొనాతో విలవిల్లాడిన ఉత్తర కొరియా.. తాజాగా వైరస్‌పై విజయాన్ని ప్రకటించుకుంది. కరోనా వ్యాప్తి పెరిగిన తర్వాత నివారణ చర్యలు తీసుకుని ఈ విజయాన్ని సాధించామని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వెల్లడించారు. ఈ విజయం ప్రపంచ ఆరోగ్య చరిత్రలో అద్భుతమైనదని ఆయన అభివర్ణించారు. అయితే, మేలో కరోనా విజృంభించగా.. వాటిని విష జ్వరాలుగా పిలిచింది ఉత్తర కొరియా. దాదాపు 4.8 మిలియన్ల మంది కరోనా బారిన పడగా.. కేవలం 74 మంది మాత్రమే మరణించారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తమ సరిహద్దులోకి దక్షిణ కొరియా కరపత్రాలను వదిలేస్తూ రెచ్చగొడుతోందని.. దీనిపై తగిన ప్రతీకారం తీర్చుకుంటామని కిమ్ సోదరి హెచ్చరించారు. కరోనాకు వ్యతిరేకంగా అద్భుతంగా పోరాడి విజయం సాధించినందుకు తన సోదరుడికి అభినందనలు తెలిపారు.
ఇవీ చదవండి: డొక్కలు మాడిన చోటే ధాన్యం మిగులు.. ఆకలి తీర్చిన అన్నం గిన్నె
ఊరికి ఉపకారం.. 75 ఏళ్ల భారతావనిలో ఎన్నో పథకాలు.. ఎన్నెన్నో మలుపులు