Covid cases in India: భారత్‌లో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య రెండేళ్ల కనిష్టానికి చేరింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం నాటికి కొత్త కేసులు 2,503 మందికి వైరస్ సోకింది. కరోనా ధాటికి మరో 27 మంది మృతి చెందారు. 2020 మే నెల తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కొత్తగా 4,377 మంది వైరస్‌ను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 98.72 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.08 శాతానికి తగ్గింది. మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.47 చేరింది.
- మొత్తం కేసులు: 42,993,494
- మొత్తం మరణాలు: 5,15,877
- యాక్టివ్ కేసులు: 36,168
- కోలుకున్నవారు: 4,24,41,449
Vaccination in India
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఆదివారం మరో 4,61,318డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,80,19,45,779 కు పెరిగింది.
World Corona cases
ప్రపంచవ్యాప్తంగానూ రోజువారీ కరోనా కేసుల సంఖ్యలో తగ్గింది. తాజాగా 13,27,973 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 45,85,76,001 పెరిగింది. మరో 3,579 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,066,237కు చేరింది.
- దక్షిణ కొరియాలో 3,50,176కరోనా కేసులు నమోదయ్యాయి. 251 మంది కరోనా రోగులు మరణించారు.
- జర్మనీలో తాజాగా 2,13,264 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. మరో 32 మంది మృతి చెందారు.
- వియత్నాంలో 1,66,968 మంది వైరస్ సోకింది. మరో 95 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో కొత్తగా 5,143 మంది కొవిడ్ బారినపడ్డారు. మరో 118 మంది వైరస్‌కు బలయ్యారు.
- రష్యాలో ఒక్కరోజే 44,989 కరోనా కేసులు బయటపడ్డాయి. 596 మంది మరణించారు.
- బ్రెజిల్లో మరో 18,397 మందికి వైరస్ సోకగా.. 146 మంది చనిపోయారు.
- ఫ్రాన్స్‌లో 60,442 కరోనా కేసులు బయటపడ్డాయి. 29 మంది మృతి చెందారు.
ఇదీ చూడండి: దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. ఏడుగురు మృతి