INDIA COVID CASES: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా గురువారం 2,259 కేసులు నమోదయ్యాయి. మరో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 2,614 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోలుకున్నవారి శాతం 98.75గా ఉంది. డైలీ పాజిటివీటి రేటు 0.50 శాతంగా నమోదైంది.
- మొత్తం కరోనా కేసులు: 4,31,01,002
- మొత్తం మరణాలు: 5,24,323
- యాక్టివ్ కేసులు: 15,044
- కోలుకున్నవారి సంఖ్య: 4,25,92,455
Vaccination India: దేశవ్యాప్తంగా బుధవారం 15,12,766 మందికిపైగా టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,91,96,32,518కు చేరింది. ఒక్కరోజే 4,51,179 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒక్కరోజే మరో 7,89,700మందికిపైగా వైరస్ బారినపడ్డారు. మరో 1,763మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 52,55,31,279కు చేరింది. మరణాల సంఖ్య 62,96,918కు చేరింది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 49,52,67,355 గా ఉంది.
- అమెరికాలో కొత్తగా 88,149 కేసులు నమోదయ్యాయి. 201 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో 56,446 కేసులు వెలుగుచూశాయి. 139 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఆస్ట్రేలియాలో తాజాగా 54,079 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో 51 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇటలీలో కొత్తగా 30,310 కేసులు బయటపడ్డాయి. మహమ్మారితో 108 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో తాజాగా 27,842 కేసులు నమోదయ్యాయి. 67 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. తగ్గిన మరణాలు