ETV Bharat / bharat

ముంబయిలో కొత్తగా 15 వేల కరోనా కేసులు- బంగాల్​లో 14,000

Covid Cases in India: ముంబయిలో కొత్తగా 15,166 కరోనా కేసులు బయటపడ్డాయి. యాక్టివ్​ కేసుల సంఖ్య 61,923గా ఉంది. మరోవైపు దిల్లీలో బుధవారం ఒక్కరోజే 10,665 కేసులు నమోదయ్యాయి. బంగాల్​లో 14 వేల మంది వైరస్​ బారినపడ్డారు.

d
ముంబయి
author img

By

Published : Jan 5, 2022, 7:56 PM IST

Updated : Jan 5, 2022, 8:13 PM IST

Covid Cases in India: ఒమిక్రాన్​ వ్యాప్తి నేపథ్యంలో మరోసారి ఆందోళనకర స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 26,538 కరోనా కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతిచెందగా 5,331 మంది కోలుకున్నారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 87,505కు చేరింది. రాష్ట్రంలో ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 797కు చేరగా.. 330 మంది కోలుకున్నారు.

ముంబయిలో కొత్తగా 15,166 కేసులు వెలుగుచూశాయి. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నగరంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 61,923గా ఉంది.

దిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం కొత్తగా 10,665 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 11.88 శాతంగా ఉంది. గతేడాది మే 12 తర్వాత ఈ స్థాయిలో కొవిడ్​ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

మరోవైపు నగరంలో మరణాల రేటు కూడా పెరుగుతోంది. ఇవాళ 8 మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాది జూన్​ 16 తర్వాత దిల్లీలో నమోదైన అత్యధిక మరణాల సంఖ్య ఇదే. ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరిగింది. ఈనెల 3,4 తేదీల్లో 140 మంది ఆసుపత్రులలో చేరారని అధికారులు వెల్లడించారు.

  • బంగాల్​లో మరో 14,022 మంది వైరస్​ బారినపడ్డారు. 17 మంది చనిపోయారు.
  • కేరళలో కొత్తగా 4,801 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. 1813 మంది కోలుకోగా 29 మంది మృతిచెందారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 22,910గా ఉండగా మృతుల సంఖ్య 48,895గా ఉంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మరో 229 మరణాలను ఈ జాబితాలో చేర్చినట్లు అధికారులు వెల్లడించారు.
  • కర్ణాటకలో కొత్తగా 4246 కొవిడ్​ కేసులు బయటపడ్డాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క బెంగళూరులోనే 3605 మందికి కరోనా సోకింది. పాజిటివిటీ రేటు 3.33 శాతంగా ఉంది. మరోవైపు కొత్తగా నమోదైన ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 226గా ఉంది.
  • బిహార్​లో 1659 కేసులు బయటపడ్డాయి. గత ఆరు నెలలలో ఈ స్థాయిలో రాష్ట్రంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. యాక్టివ్​ కేసుల సంఖ్య 3వేలు దాటింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 13,786 మరణాలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి : '8 రోజుల్లోనే 6.3 రెట్లు పెరిగిన కరోనా కేసులు'

Last Updated : Jan 5, 2022, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.