ETV Bharat / bharat

మహారాష్ట్రలో ఒక్కరోజే 45 వేలు దాటిన కరోనా కేసులు

Covid Cases in India: మహారాష్ట్రలో కొత్తగా 46,723 కొవిడ్​ కేసులు బయటపడ్డాయి. దిల్లీ సహా బంగాల్​, కర్ణాటక రాష్ట్రాల్లో 20వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధికంగా 199 మంది మృతి చెందారు.

delhi covid cases
దిల్లీలో కరోనా కేసులు
author img

By

Published : Jan 12, 2022, 9:03 PM IST

Updated : Jan 12, 2022, 9:17 PM IST

Covid Cases in India: దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి తీవ్రంగా ఉంది. కరోనా హాట్​స్పాట్​ అయిన మహాారాష్ట్రలో ఆందోళనకర స్థాయిలో కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 46,723 మందికి పాజిటివ్​ అని నిర్ధరణ కాగా.. 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 28,041 మంది కోలుకున్నారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 2,40,122కు చేరింది. మరోవైపు రాష్ట్రంలో ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 1367కు చేరింది.

ప్రాంతం కేసులు మరణాలు
మహారాష్ట్ర46,72332
దిల్లీ27,56140
బంగాల్​22,15523
కర్ణాటక21,39010
తమిళనాడు17,93419
ఉత్తర్​ప్రదేశ్​13,6813
కేరళ12,742199
గుజరాత్​9,9414
మధ్యప్రదేశ్ ​3,6391
జమ్ముకశ్మీర్​1,695 1
చండీగఢ్​1,114-

దేశవ్యాప్తంగా బుధవారం 1,94,720 కరోనా కేసులు బయటపడ్డాయి. కొవిడ్​ కారణంగా మరో 442 మంది మరణించారు. 60,405 మంది వైరస్​ను జయించారు. కొవిడ్​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 11.05 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఒమిక్రాన్​ కేసులు

దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 27 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 85,26,240 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,53,80,08,200కు చేరింది.

ఇదీ చూడండి : 'ఒమిక్రాన్​ను సాధారణ జలుబుగా భావించవద్దు'

Last Updated : Jan 12, 2022, 9:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.