Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం మధ్య 21,411 మంది వైరస్ బారినపడగా.. మరో 67 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి తాజాగా 20,726 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.46 శాతానికి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.46 శాతానికి పెరిగింది.
- మొత్తం కేసులు : 4,38,68,476
- మొత్తం మరణాలు: 5,25,997
- యాక్టివ్ కేసులు: 1,50,100
- కోలుకున్నవారి సంఖ్య: 4,31,92,379
Vaccination India: భారత్‌లో శుక్రవారం 34,93,209 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 201.68 కోట్లు దాటింది. మరో 4,80,202 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 8,72,073 మంది వైరస్ బారినపడగా.. మరో 1,841 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 57,35,11,698కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 64,00,784 మంది మరణించారు. ఒక్కరోజే 7,48,791 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 54,33,87,996కు చేరింది.
- జపాన్‌లో 1,80,826 కేసులు నమోదు కాగా.. 38 మంది మరణించారు.
- అమెరికాలో తాజాగా 1,06,465 మందికి వైరస్ సోకగా.. 321 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో కొత్తగా 74,348 మందికి కరోనా సోకింది. 113 మంది మరణించారు.
- ఇటలీలో కొత్తగా 71,075 మందికి వైరస్ సోకగా.. 155 మంది మరణించారు.
- దక్షిణ కొరియాలో తాజాగా 68,579 కేసులు నమోదు కాగా.. 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇవీ చూడండి : ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. ఆత్మహత్యా? లేక...
రిటైర్మెంట్ ప్రకటించిన రాజకీయ దిగ్గజం.. ఇక కుమారుడి ఇన్నింగ్స్!