Covid Cases in India: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం మధ్య 20,551 మందికి వైరస్ నిర్ధరణ కాగా.. మరో 70 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 5.14 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో కొవిడ్ నుంచి 21,595 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.50 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 0.31శాతంగా ఉన్నాయి.
- మొత్తం కేసులు : 4,40,40,362
- మొత్తం మరణాలు: 5,26,600
- యాక్టివ్ కేసులు: 1,35,364
- కోలుకున్నవారి సంఖ్య: 4,34,45,624
Vaccination India:
భారత్‌లో గురువారం 36,95,835 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 205.59 కోట్లు దాటింది. మరో 4,00,110 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 7,99,008 మంది వైరస్ బారినపడగా.. మరో 1,795 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,63,97,203కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 64,29,807 మంది మరణించారు. ఒక్కరోజే 8,34,923 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 55,65,30,925కు చేరింది.
- జపాన్‌లో 2,31,597 కేసులు నమోదు కాగా.. 157 మంది మరణించారు.
- దక్షిణ కొరియాలో తాజాగా 1,07,849 కేసులు నమోదు కాగా.. 34 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో 86,309 కేసులు నమోదయ్యాయి. 311 మంది మరణించారు.
- ఇటలీలో కొత్తగా 42,959 మందికి కరోనా సోకింది. 161 మంది బలయ్యారు.
- ఆస్ట్రేలియాలో తాజాగా 37,261 మందికి కొవిడ్ సోకగా.. 85 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి : భారత్‌లో ఎన్ని కోట్ల వాహనాలు ఉన్నాయో తెలుసా?
దేశవ్యాప్తంగా 4.24 కోట్ల కేసులు పెండింగ్.. సుప్రీంలోనే 71వేలు..