Covid Cases in India: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం మధ్య 20,528 మంది వైరస్ బారినపడగా.. మరో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి తాజాగా 17,790 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.47 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.33 శాతానికి పెరిగింది.
- మొత్తం కేసులు : 4,37,50,599
- మొత్తం మరణాలు: 5,25,709
- యాక్టివ్ కేసులు: 1,43,449
- కోలుకున్నవారి సంఖ్య: 4,30,81,441
Vaccination India: భారత్‌లో శుక్రవారం 25,59,840 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,99,98,89,097కు చేరింది. మరో 3,92,569 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 6,47,222 మంది వైరస్ బారినపడగా.. మరో 916 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 56,70,61,732కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 63,86,836 మంది మరణించారు. ఒక్కరోజే 5,21,679 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 53,81,62,048కు చేరింది.
- ఫ్రాన్స్‌లో కొత్తగా 1,24,009 మందికి కరోనా సోకింది.
- జపాన్‌లో కరోనా ఉద్ధృతి పెరిగింది. కొత్తగా 99,291 మందికి వైరస్ సోకింది. 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇటలీలో కొత్తగా 89,830 మందికి వైరస్ సోకగా.. 111మంది మరణించారు.
- దక్షిణ కొరియాలో తాజాగా 41,273 మందికి వైరస్ సోకగా.. 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో 40,149 కేసులు నమోదు కాగా.. 208 మంది మరణించారు.
ఇవీ చూడండి : Neet Exam: దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు సర్వం సిద్దం
హడావుడిగా పాక్‌లో ల్యాండైన భారత విమానం.. హైదరాబాద్‌కు వస్తుండగా!