కొవిడ్ వ్యాక్సినేషన్ సెషన్స్ కోసం ఏర్పాటు చేసిన కొవిన్ యాప్ సేవలకు రెండు రోజుల పాటు అంతరాయం కలగనుంది. కొవిన్ 1.0 నుంచి కొవిన్ 2.0 వర్షన్‌కు సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయడమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు శని, ఆదివారాల్లో కొవిడ్ టీకా పంపిణీ ఉండదని స్పష్టం చేసింది.
మార్చి 1 నుంచి 60 ఏళ్లపైడిన వారికి, 45 ఏళ్లు దాటిన వారికి (వ్యాధి ప్రబలత ఎక్కువున్న వారు) టీకా అందించేందుకు రంగం సిద్ధం అయిన నేపథ్యంలో కేంద్రం ఈ ఏర్పాట్లను చేస్తోంది. కాబట్టి ఫిబ్రవరి 27, 28న (శనివారం, ఆదివారం) కొవిన్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రాలకు సమాచారం ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి : వాకిలే పాఠశాల.. రూపాయికే చదువు!