ETV Bharat / bharat

'దేశంలో తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు' - దేశంలో కరోనా పరిస్థితి

దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు, యాక్టివ్​ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని పేర్కొంది.

COVID-19
కరోనా
author img

By

Published : May 22, 2021, 5:31 PM IST

Updated : May 22, 2021, 9:04 PM IST

దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రోజు వారి కేసులు, పాజిటివిటీ రేటు, యాక్టివ్​ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని పేర్కొంది. మే 10న 24.83 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు మే 22నాటికి 12.45కి చేరిందని తెలిపింది.

ఇప్పటివరకు 8 రాష్ట్రాల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య లక్షకు పైగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్ తెలిపారు. 15 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 15 శాతానికి పైగా ఉందని స్పష్టం చేశారు. కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఇంకా 382 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగానే ఉందని నీతి ఆయోగ్​ సభ్యుడు వీకే పాల్​ అన్నారు.

వ్యాక్సిన్ వృథా సైతం భారీగా తగ్గిందని వీకే పాల్​ తెలిపారు. మార్చి 1న 8 శాతంగా ఉన్న కొవిషీల్డ్​ టీకా వృథా ప్రస్తుతానికి ఒక శాతంగా ఉందని అన్నారు. కొవాగ్జిన్​​ టీకా వృథా 17 శాతం నుంచి 4 శాతానికి తగ్గిందని వెల్లడించారు.

వ్యాక్సిన్​ పాస్​పోర్టు..

వ్యాక్సిన్​ పాస్​పోర్ట్​ వ్యవహారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాయిలో ఇంకా ఎలాంటి ఏకాభిప్రాయానికి రాలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​ తెలిపారు. వ్యాక్సిన్ వేసుకున్నవారిని మాత్రమే అంతర్జాతీయంగా అన్ని ప్రదేశాలకు అనుమతించే అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. నెగెటివ్​ రిపోర్ట్ ఉన్నవారిని ప్రస్తుతానికి అన్ని దేశాలు అనుమతిస్తున్నాయని పేర్కొన్నారు.

కొవాగ్జిన్​ను టీకాల జాబితాలో డబ్ల్యూహెచ్​ఓ చేర్చని నేపథ్యంలో ఈ టీకా వేసుకున్నవారికి అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతి ఉంటుందా అనే అంశంపై కూడా లవ్​ అగర్వాల్ స్పందించారు. తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇలాంటి వాదనలను ఆరోగ్య శాఖ గతంలోనూ ఖండించిందని తెలిపారు.

ఇదీ చదవండి: తమిళనాడులో మరో వారం పాటు లాక్​డౌన్​ పొడిగింపు

:గాలి ద్వారా బ్లాక్​ ఫంగస్ వ్యాప్తి- వాటిపైనా ప్రభావం!

Last Updated : May 22, 2021, 9:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.