దేశంలో మరో 50వేల 209 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వైరస్ సోకిన వారిలో మరో 704 మంది మృతి చెందారు.
దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 12,09,425 నమూనాలను పరీక్షించినట్టు తెలిపింది భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్). ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 11కోట్ల 42లక్షలు దాటింది.
వైరస్ సోకిన వారిలో ఇప్పటివరకు 92 శాతం మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్త రికవరీ రేటు 92.20 శాతంగా ఉంది. మరణాల రేటు 1.49 శాతంగా నమోదైనట్టు వెల్లడించింది.
ఇదీ చదవండి: 'ఆగస్టు కల్లా 25 కోట్ల మందికి కొవిడ్ టీకా'