20 రోజుల నుంచి దేశంలో కరోనా ఉద్ధృతి స్థిరంగా తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత వారం నుంచి 24 రాష్ట్రాల్లో తగ్గుతున్న యాక్టివ్ కేసులే ఇందుకు నిదర్శనమని వెల్లడించింది.
టెస్టుల సంఖ్య గణనీయంగా పెంచినప్పటికీ.. గత వారం నుంచి పాజిటివిటీ రేటు తగ్గుతోందని వెల్లడించింది. ప్రస్తుతం కొనసాగిస్తున్న ఆంక్షలు సడలించినా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
రెండో డోసు మరో టీకా వేసుకుంటే ఎలాంటి దుష్ప్రభావం ఉండకపోవచ్చని తెలిపింది. కానీ దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమని అభిప్రాయపడింది.
ఇదీ చదవండి: White fungus: రోగి పేగులకు సోకిన వ్యాధి