కేరళలో కరోనా(Kerala Corona Cases) వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. కొత్తగా 5,297 మందికి వైరస్(Kerala Covid Cases Today) నిర్ధరణ అయింది. అయితే.. మరణాల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 368 మంది కరోనాతో(Kerala Corona Cases) మరణించినట్లు తేలింది. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 49,73,954కు చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 32,049కి పెరిగింది.
కేరళలో మరో 7,325 మంది వైరస్ను(Kerala Corona Cases) జయించారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 48,64,506కి చేరుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 76,786 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 51,577 నమూనాలను పరీక్షించగా.. ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 867 మందికి వైరస్ సోకినట్లు తేలింది. తిరువనంతపురంలో 750, కోజ్కోడ్లో 637 మందికి వైరస్ నిర్ధరణ అయింది.
వివిధ రాష్ట్రాల్లో కొత్త కేసులు ఇలా...
- తమిళనాడులో మరో 990 మందిలో వైరస్ నిర్ధరణ అయ్యింది. 20 మంది చనిపోయారు.
- మహారాష్ట్రలో 809 మంది మహమ్మారి బారినపడ్డారు. మరో 10 మంది మరణించారు.
- కర్ణాటకలో 188 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. మరో ఇద్దరు మృతి చెందారు.
- మిజోరంలో కొత్తగా 165 మందికి కరోనా సోకగా.. మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
78 శాతం మందికి మొదటి డోసు..
దేశంలో అర్హులైన 78 శాతం మందికి మొదటి డోసు పూర్తయినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సూఖ్ మాండవీయ తెలిపారు. 38 శాతం మందికి రెండు డోసులు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: దిల్లీలో 'డెంగీ' డేంజర్ బెల్స్- కేంద్రం హైఅలర్ట్