దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి బుధవారం వరకు.. రోజుకు సగటున 34 లక్షల 30వేల మందికిపైగా టీకా పంపిణీ చేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 29.79 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వగా.. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 9 కోట్ల 1లక్షా 98వేల 673కు చేరిందని వెల్లడించింది.
ప్రపంచంలోనే అత్యధికంగా టీకా అందిస్తోన్న దేశాల్లో తొలి స్థానంలో ఉంది భారత్. అంతకుముందు ఆ స్థానంలో అమెరికా ఉండగా.. ఆ దేశాన్ని భారత్ బుధవారం వెనక్కి నెట్టింది.
ఇదీ చదవండి: వైరస్ కట్టడికి ఎంపీలో వారాంతపు లాక్డౌన్