ETV Bharat / bharat

కొత్త అసెంబ్లీ భవనం టెండర్లు రద్దు!

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కొత్త అసెంబ్లీ భవనం టెండర్లను రద్దు చేసింది ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వం. ఇప్పటికే ప్రారంభమైన పలు పనులను నిలిపివేయాలని నిర్మాణ సంస్థలను ఆదేశించింది. ప్రజలే తమకు తొలి ప్రాధాన్యమని ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​ తెలిపారు.

Chhattisgarh
ఛత్తీస్​గఢ్ కొత్త అసెంబ్లీ నమూనా
author img

By

Published : May 13, 2021, 7:27 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో కీలక నిర్ణయం తీసుకుంది ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వం. కొత్త అసెంబ్లీ భవన నిర్మాణానికి ఆహ్వానించిన టెండర్లను రద్దు చేసింది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పనులను నిలిపివేసింది. కరోనా కట్టడిపైనే ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపింది.

నయా రాయ్​పుర్​లో నిర్మించ తలపెట్టిన గవర్నర్​ హౌస్​, అసెంబ్లీ హౌస్​, ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్​ అధికారుల నివాసాలు, న్యూ సర్క్యూట్​ హౌస్ పనులు నిలిపివేసినట్లు ఓ ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రాజెక్టుల పనులకు 2019 నవంబర్​ 25న భూమి పూజ చేశారు.

" ప్రజలే మా తొలి ప్రాధాన్యం. కరోనా ప్రారంభానికి ముందు అసెంబ్లీ భవనం, రాజ్​ భవన్​, సీఎం నివాసం వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఆయా ప్రాజెక్టులను నిలిపివేస్తున్నాం. "

- భూపేశ్​ బఘేల్​, ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి

నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని ప్రజా పనుల విభాగం ఇంజినీరు సంబంధిత సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రకటనలో తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. సెక్టార్​-19లో కొత్త అసెంబ్లీ భవన నిర్మాణానికి రూ.245.16 కోట్లు, రూ.118 కోట్లు విలువైన రెండు ప్రాజెక్టులకు పిలిచిన టెండర్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.

సెంట్రల్​ విస్టా నిర్మాణ పనులను కొనసాగించటంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలో ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వం చేపట్టిన అసెంబ్లీ, ఇతర ప్రాజెక్టుల నిర్మాణంపై భాజపా ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో టెండర్లు రద్దు చేసి గట్టి సమాధానమిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.

ఇదీ చూడండి: ఐదు నెలల్లో 216 కోట్ల టీకా డోసులు రెడీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.